ఐపీఎల్‌లో అత్య‌ధిక వేత‌నం పొందుతున్న టాప్ 10 ప్లేయ‌ర్లు వీరే..!

-

క‌రోనా కార‌ణంగా ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో జ‌ర‌గాల్సిన ఐపీఎల్ కొన్ని మ్యాచ్‌లు మాత్ర‌మే జ‌రిగింది. దీంతో ఆదివారం నుంచి యూఏఈలో ఐపీఎల్ 2021 రెండో ద‌శ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే అన్ని జ‌ట్ల‌కు చెందిన ప్లేయర్లు దుబాయ్‌కు చేరుకోగా క్రికెట్ ఫ్యాన్స్ అంద‌రూ ఒక నెల రోజుల పాటు వినోదం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సారి ఐపీఎల్‌లో ఆడుతున్న టాప్ ధనిక ప్లేయ‌ర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఐపీఎల్ లో ఈ సారి రూ.15 కోట్లు చెల్లిస్తున్నారు. చెన్నైని ధోనీ ఎన్నోసార్లు ఫైన‌ల్స్‌లో నిలిపాడు. అత‌ని నాయ‌క‌త్వంలో చెన్నై ప‌లు మార్లు ట్రోఫీల‌ను కూడా లిఫ్ట్ చేసింది. దీంతో ఈసారి కూడా ట్రోఫీని లిఫ్ట్ చేయ‌గ‌ల‌మ‌ని చెన్నై గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉంది.

2. రాయల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ కోహ్లికి ఈ సీజ‌న్‌లో రూ.17 కోట్లు చెల్లించ‌నున్నారు. ఎన్నో సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నా బెంగ‌ళూరును అదృష్టం వ‌రించ‌లేదు. మ‌రి ఈసారి ఏమ‌వుతుందో చూడాలి.

3. క్రిస్ గేల్‌కు ఐపీఎల్‌లో రూ.2 కోట్ల వేత‌నం చెల్లిస్తుండ‌గా.. అత‌ను ప్ర‌స్తుతం పంజాబ్ కింగ్స్ టీమ్‌కు ఆడుతున్నాడు.

4. ష‌కిబ్ అల్ హ‌స‌న్‌కు రూ.3.2 కోట్లు చెల్లిస్తుండ‌గా అత‌ను కోల్‌క‌తా నైట్ రైడర్స్ జ‌ట్టు త‌ర‌ఫున ఆడుతున్నాడు.

5. ఢిల్లీ జ‌ట్టుకు ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ స్టీవ్ స్మిత్ కు రూ.2.2 కోట్లు ఇస్తున్నారు. ఇత‌ను గ‌తంలో రాజ‌స్థాన్ కు ఆడాడు.

6. రోహిత్ శ‌ర్మ ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా ఎన్నో టైటిల్స్ ను జ‌ట్టుకు అందించాడు. అత‌నికి రూ.15 కోట్ల వేత‌నం ఇస్తున్నారు.

7. రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తురుపు ముక్క‌గా ఉన్న ఏబీ డివిలియ‌ర్స్‌కు ఆ జ‌ట్టు యాజ‌మాన్యం రూ.11 కోట్ల‌ను చెల్లిస్తోంది.

8. ఢిల్లీ జ‌ట్టుకు ఆడుతున్న డాషింగ్ ఓపెన‌ర్ బ్యాట్స్‌మ‌న్ శిఖ‌ర్ ధావ‌న్‌కు రూ.5.20 కోట్ల‌ను చెల్లిస్తున్నారు.

9. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కెప్టెన్‌గా ఉన్న ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ డేవిడ్ వార్న‌ర్‌కు రూ.12.50 కోట్ల‌ను చెల్లిస్తున్నారు.

10. స‌న్‌రైజ‌ర్స్‌కు ఆడుతున్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మ‌న్ కేన్ విలియ‌మ్స‌న్‌కు రూ.3 కోట్లు చెల్లిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version