కౌశిక్ రెడ్డికి షాక్ : షోకాజ్ నోటీసులు జారీ చేసిన టీపీసీసీ

బ్రేకింగ్ : కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి టీపీసీసీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పాడి కౌశిక్ రెడ్డి ఆడియో వైరల్ అయిన నేపథ్యంలో..ఆయనకు టీపీసీసీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దీనిపై టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి షో కాజ్ నోటీస్ జారీ చేశామని చెప్పిన ఆయన.. పాడి కౌశిక్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.

అంతేకాదు.. టిఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు అనేక ఫిర్యాదులు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. గతంలోనే కౌశిక్ రెడ్డిని క్రమశిక్షణ సంఘం పిలిచి హెచ్చరించినా ఆయన తీరుమారలేదని చెప్పారు. 24 గంటల్లోగా ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని నోటీస్ లో పేర్కొన్నామని కోదండరెడ్డి వెల్లడించారు. లేని పక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కోదండరెడ్డి. కాగా గత కొంత కాలంగా కౌశిక్ రెడ్డి.. టీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.