త్రివేణి సంగమంలా కూటమి పార్టీలు: పవన్ కళ్యాణ్

-

టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి త్రివేణి సంగమంలా ఈ రాష్ట్రాన్ని కాపాడుతాయని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. కోనసీమ అంబేడ్కర్ జిల్లా పి. గన్నవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…’యువతకు భరోసా ఇవ్వడానికి, ఈ ప్రాంతానికి కొబ్బరి బోర్డు తీసుకురావడానికి కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు. కోనసీమకు కొబ్బరి అనుబంధ పరిశ్రమలు రావాలి. 5 కోట్ల మంది ప్రజలను కాపాడేందుకు, రైతు కన్నీరు తుడిచేలా కూటమి అండగా నిలుస్తుంది. రైతుభరోసా కేంద్రాలు కాకినాడ మాఫియా డాన్ చేతుల్లోకి వెళ్లాయి’ అని పవన్ వ్యాఖ్యానించారు.

పచ్చని అందమైన కోనసీమను వైసీపీ ప్రభుత్వం కలహాల సీమగా మార్చేందుకు ప్రయత్నించిందని ఆయన మండిపడ్డారు. ‘కోనసీమను ప్రేమ సీమగా మార్చేందుకు మేం ముందుకు వచ్చాం. 2.5 లక్షల హెక్టార్ల కొబ్బరి తోటలతో నిండిన కోనసీమను కొట్లాట సీమగా మారకుండా మేం కృషి చేశాం అని గుర్తు చేశారు భవిష్యత్తులో కూడా ప్రేమ సీమగా ఉండేలా, అన్ని కులాల ప్రజలు, మైనార్టీలు కలిసి ఉండేలా పనిచేస్తాం’ అని ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version