తలమీద సోరియాసిస్ తో ఇబ్బంది పడుతున్నారా..?

-

మీరు చూసేఉంటారు.. కొందరికి తలమీద పొలుసులు ఉంటాయి. ఏంటో తెల్లగా పేడుకట్టేసి చూడ్డానికే ఇబ్బందిగా అనిపిస్తాయి. అలాంటివారు మీతో దగ్గరగా కూర్చోని మాట్లాడినా.. కాస్త అన్ ఈజీగానే ఫీల్ అవుతారు. మరీ ఆ సమస్యతో బాధపడేవారి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. సోరియాసిస్ కారణంగా ఇవి ఏర్పడతాయి. దీని కోసం మందులు వాడినా సరైన ఫలితాలు ఉండటం లేదని ఎంతో మంది అంటున్నారు. మరి ఎలా ఈ తలమీద పొలుసులను తగ్గించుకోవడం.?

తల మీద సోరియాసిస్‌ గలవారిలో చర్మం పైన అక్కడక్కడా ఉబ్బెత్తుగా, ఎర్రగా, పొలుసులు ఉంటాయి. చూడ్డానికి చుండ్రులా కనిపిస్తుంది. రోగనిరోధకశక్తి చర్మ కణాల మీద దాడిచేయటం వల్ల వస్తుందని వైద్యులు అంటున్నారు. దీంతో చర్మకణాలు చాలా త్వరగా పెరుగుతూ, అట్టుకట్టినట్టు ఏర్పడతాయి. తల మీద సోరియాసిస్‌కు ప్రధానంగా నాలుగు రకాల మందులు అందుబాటులో ఉన్నాయి.

వయసు, వైవాహిక స్థితిని బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. పెళ్లి అయినా, కాకపోయినా అప్రిమిలాస్ట్‌ మాత్రలను వాడుకోవచ్చు. ఇవి ఒంట్లో వాపుప్రక్రియకు (ఇన్‌ఫ్లమేషన్‌) దారితీసే పదార్థాలను అడ్డుకోవటం ద్వారా ఉపశమనం కలిగిస్తాయి. వీటిని ఉదయం, రాత్రి ఒకటి చొప్పున మూడు నెలలు వాడితే ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగే కోల్‌ టార్‌, స్టిరాయిడ్లతో కూడిన కొన్ని లోషన్లు వాడుకోవచ్చు. వీటిని రాత్రిపూట తలకు పెట్టుకొని ఉదయాన్నే కోల్‌ టార్‌ షాంపూతో స్నానం చేస్తే పొలుసులు తగ్గుముఖం పడతాయట.

ఆహారం విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వాపు ప్రక్రియను ప్రేరేపించే మాంసాహారం, మసాలాలు, వేపుళ్లు ఎక్కువగా తీసుకోకూడదు. పండ్లు, కూరగాయలు.. బాదం, పిస్తా వంటివి ఎక్కువగా తినాలి. ఒత్తిడి, విచారంతో సోరియాసిస్‌ ఎక్కువయ్యే అవకాశముంది కాబట్టి వీటిని తగ్గించుకోవటానికి ప్రయత్నించాలి. తలమీద సోరియాసిన్ ను తగ్గించుకునేందుకు ఎంత త్వరగా వీలైతే అంత తర్వగా మంచి స్కిన్ డాక్టర్ ను సంప్రదించి చికిత్స మొదలుపెట్టాలి. లేదంటే ఇది తలంతా వ్యాపిస్తుంది. దీని వల్ల జుట్టుకూడా రాలిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news