‘అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు’గా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్తితి ఉంది…బలమైన నాయకత్వం ఉంది..కేడర్ ఉంది..కానీ నాయకుల మధ్య సమన్వయం లేదు..ఎప్పుడు ఏదొక రచ్చ నడుస్తూనే ఉంది..దీని వల్ల కాంగ్రెస్ పరిస్తితి కాసేపు మెరుగైనట్లే కనిపిస్తున్నా..ఒక్కసారిగా పార్టీ పరిస్తితి దిగజారుతున్నట్లే కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పరిస్తితి దిగజారుతూనే వస్తుంది..వరుసగా రెండు సార్లు ఓటములతో కాంగ్రెస్ రేసులో వెనుకబడింది. కానీ ఎప్పుడైతే పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి వచ్చారో అప్పటినుంచి కాంగ్రెస్ రేసులోకి వచ్చింది.
ఆయన దూకుడుగా రాజకీయం చేయడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే పరిస్తితి వచ్చింది. కానీ ఆయన్ని సీనియర్ నేతలు ఎక్కడకక్కడ వెనక్కి లాగుతున్నట్లే కనిపిస్తోంది. బహిరంగంగానే ఆయనపై విమర్శలు చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీతో పోరాడాల్సిన రేవంత్ కాస్త ముందు సొంత పార్టీలోనే లుకులుకలకు చెక్ పెట్టాల్సిన పరిస్తితి వస్తుంది. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ లో కొత్త వివాదం వస్తూనే ఉంది.
అసలు రాష్ట్రంలో టీఆర్ఎస్-బీజేపీల మధ్య పోరు జరుగుతుంటే…కాంగ్రెస్ పార్టీలో మాత్రం…సొంత నాయకులే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రచ్చ లేపుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ లో జగ్గారెడ్డి ఎపిసోడ్ బాగా హైలైట్ అవుతుంది…మొదట నుంచి జగ్గారెడ్డి…రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఆ మధ్య కాంగ్రెస్ అధిష్టానం సర్ది చెప్పడంతో జగ్గారెడ్డి కాస్త సైలెంట్ అయ్యారు..ఎప్పుడుపడితే అప్పుడు మీడియాకు ఎక్కలేదు.
కానీ తాజాగా రేవంత్ కాంగ్రెస్ నేతలు ఎవరు రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాని కలవొద్దని చెప్పారు…కానీ వీహెచ్ కలిశారు…దీంతో రేవంత్ సీరియస్ అయ్యి…పార్టీ లైన్ కు విరుద్ధంగా వెళితే సొంత పార్టీ నేతలనే గొడకేసి కొడతానని అన్నారు. దీనిపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు…కొట్టించుకోవడానికి రేవంత్ పాలేరులు ఎవరు లేరని, రేవంత్ పై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని అన్నారు…అలాగే సంచలన ప్రకటన చేస్తానని చెప్పి, అధిష్టానం నేతలకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు. ఇక జగ్గారెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు గాని…ఆయన ఎపిసోడ్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేస్తుంది. మొత్తానికి రాజకీయ రేసులో టీఆర్ఎస్-బీజేపీలతో పోలిస్తే కాంగ్రెస్ వెనుకబడిపోయింది.