సీఎం యోగి ఆదిత్యనాథ్ కార్యాలయంలో హ్యాకర్ల దాడి..

-

ఉత్తరప్రదేశ్ లోని సీఎం కార్యాలయం లో ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు హ్యాకర్లు.ఇటీవల కాలంలో హ్యాకర్లు రెచ్చిపోతున్నారు సెలబ్రిటీస్, రాజకీయ నాయకులే లక్ష్యంగా గా వారి ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం కార్యాలయ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. అనంతరం అనేక పోస్టులను పోస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి సీఎం కార్యాలయ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసినట్లుగా శనివారం సీఎం కార్యాలయం తెలియజేసింది. దాదాపు నాలుగు గంటల తర్వాత ఖాతాను పునరుద్ధరించిన తెలియజేశారు. ఆ ట్విట్టర్ ఖాతాలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటోలు తొలగించారు.

వందలాది మంది ట్విట్టర్ వినియోగదారులకు ట్యాగ్ చేస్తూ హ్యాకర్ అనే ట్వీట్లు చేశారు.ఒక కార్టూనిస్టు చిత్రాన్ని ప్రొఫైల్ పిక్చర్ గా ఉపయోగించారు. Tutorial: how to trun on your bayc/mayc అనే ట్వీట్ ను పిన్ చేశారు. ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. హ్యాకర్లు పెట్టిన అన్ని ట్వీట్లను తొలగించారు. కాగా హ్యాక్ అయిన సీఎంఓ అకౌంట్ స్క్రీన్ షాట్ లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం సీఎంఓ (@CMOfficeUP) ట్విట్టర్ ఖాతా కు నాలుగు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news