బెంగళూరులోని నర్సింగ్ కళాశాలకు చెందిన 12 మంది విద్యార్థులకు కొవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. వీరిలో 11 మంది వ్యాక్సిన్ తీసుకున్నా వైరస్ సోకడం గమనార్హం. మరో తొమ్మిది విద్యార్థులు కూడా కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు కాలేజ్ యాజమాన్యం తెలిపింది.
కరోనా సోకిన విద్యార్థులు, సిబ్బంది సంఖ్య ఒకే రోజులో 66 నుంచి 182కు పెరగడంతో ధార్వాడ్‌లో మెడికల్ కాలేజీని కొవిడ్-19 క్లస్టర్‌గా ప్రకటించారు. ప్రస్తుతం మరసూర్‌లో స్ఫూర్తి నర్సింగ్ కాలేజీలో విద్యార్థులు కరోనా బారిన పడిన విషయం వెలుగులోకి వచ్చింది.
కొవిడ్-19 బారిన పడిన 12 మంది విద్యార్థులు బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. గత జూన్‌లో ఓ విద్యార్థిని కరోనా బారిన పడటంతో ఆమెకు వ్యాక్సిన్ తీసుకోలేదు. అధికారుల ప్రకారం ప్రతి 15 రోజులకు ఒక్కసారి విద్యార్థులు, సిబ్బందికి మెడికల్ కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తుంటుంది. మిగతా విద్యార్థులతోపాటు కరోనా బారిన పడిన విద్యార్థులతో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న అందరికీ టెస్టు చేయనున్నారు.