ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్‌..ఏసీబీ కోర్టు తీర్పుపై హైకోర్టుకు సిట్‌

-

టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఏసీబీ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించింది సిట్‌. ఈ కేసులో ఏసీబీ కోర్టు నిన్న సంచలన నిర్ణయం తీసుకుంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు మోమోను కొట్టివేసింది ఏసీబీ కోర్టు.

బిఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామి, శ్రీనివాస్ ను నిందితులుగా చేర్చుతూ పోలీసులు దాఖలు చేసిన మోమోను కొట్టు వేసింది. దీంతో పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. అయితే, తాజాగా ఈ కేసును దర్యాప్తు చేసే సిట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిన్న ఏసీబీ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హై కోర్టు లో పిటీషన్‌ దాఖలు చేసింది సిట్‌. ఇక దీనిపై ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news