చినబాబు సీటులో ట్విస్ట్..అదే ఫిక్స్?

-

గత ఎన్నికల నుంచి ఏపీ రాజకీయాల్లో బాగా చర్చ జరుగుతున్న అంశాల్లో నారా లోకేష్ సీటు అంశం కూడా ఒకటి…2019 ఎన్నికల నుంచి నారా లోకేష్ సీటు గురించి చర్చ నడుస్తూనే ఉంది. ఊహించని విధంగా 2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక లోకేష్ ఓటమిపై ప్రత్యర్ధులు ఏ రేంజ్లో సెటైర్లు వేశారో అందరికీ తెలిసిందే. అందుకే ఈ సారి ఎలాగైనా గెలవాలనే కసితో లోకేష్ పనిచేస్తున్నారు…టోటల్ గా తన రాజకీయాన్ని మార్చుకుని ముందుకెళుతున్నారు.

అయితే మళ్ళీ లోకేష్ మంగళగిరి నుంచే పోటీ చేయడం ఖాయమే…ఓడిన చోటే గెలవాలనే పట్టుదలతో లోకేష్ పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు మంగళగిరిలో తిరుగుతూ…ప్రజలకు దగ్గరవుతున్నారు. మరి లోకేష్ ఇంత చేస్తున్నా కూడా…ఆయన ఈ సారి వేరే సీటులో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతూనే ఉంది. అనేక పర్యాయాలు లోకేష్..కుప్పం నుంచి పోటీకి దిగుతారని కథనాలు వచ్చాయి. కుప్పంలో అయితే లోకేష్ గెలుపుకు ఇబ్బంది ఉండదని, చంద్రబాబు వేరే నియోజకవర్గానికి మారిపోతారని ప్రచారం వచ్చింది.

కుప్పం మాత్రమే కాదు..విశాఖలోని భీమిలి,కృష్ణా జిల్లాలోని పెనమలూరు సీట్ల ప్రస్తావన కూడా ఇచ్చింది. ఇక ఇటీవల చినబాబు సీటు విషయంలో మరొక ట్విస్ట్ వచ్చింది…ఆయన ఈ సారి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో పోటీ చేస్తారని ప్రచారం మొదలైంది. ఇచ్చాపురం మొదట నుంచి టీడీపీకి కంచుకోటే…పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఒక్కసారి మాత్రమే టీడీపీ అక్కడ ఓడిపోయింది. ఇక గత ఎన్నికల్లో జగన్ గాలిలో కూడా ఇచ్చాపురంలో టీడీపీ గెలిచింది.

అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఇదే సీటులో చినబాబు పోటీ చేస్తారని కథనాలు వస్తున్నాయి…అక్కడైతే సేఫ్ గా నారా లోకేష్ గెలిచేస్తారని చెబుతున్నారు. మరి ఈ కథనాల్లో నిజం ఉందా? అంటే టీడీపీ శ్రేణులు లేదనే అంటున్నాయి. లోకేష్ మళ్ళీ మంగళగిరిలోనే పోటీ చేస్తారని, ఇందులో ఎలాంటి డౌట్ లేదని, ఓడిన చోటే గెలిచి చూపిస్తారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version