జగన్ ‘క్యాబినెట్’లో ట్విస్ట్…అందరినీ తీసేయండి?

-

మొత్తానికి ఏపీ క్యాబినెట్ కథ చివరికి వచ్చింది…ఇంతకాలం క్యాబినెట్లో మార్పులు గురించి రకరకాల చర్చలు నడిచిన విషయం తెలిసిందే…ఒకసారి 100 శాతం మార్పులు జరగొచ్చని, మరొకసారి 80 శాతం, 50 శాతం అంటూ ప్రచారం జరిగింది…కానీ దీనిపై పూర్తి క్లారిటీ రాలేదు..అలాగే జగన్ రెండున్నర ఏళ్లలో మంత్రివర్గంలో మార్పులు చేస్తానని చెప్పారు గాని…రెండున్నర ఏళ్లలో మార్పులు చేయలేదు.

అయితే తాజాగా జగన్ మంత్రివర్గంలో మార్పులు గురించి కీలక నిర్ణయం తీసుకున్నారు..ఈ జూన్ నెలలోనే మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పేశారు. కాకపోతే 100 శాతం మార్పులు చేస్తారా? లేక కొంతమందిని మంత్రివర్గంలో తీసుకుని, పాతవారిలో కొందరిని కంటిన్యూ చేస్తారా అనే అంశంపై క్లారిటీ లేదు. ప్రస్తుతం వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..కొందరిని మంత్రివర్గలో కొనసాగించవచ్చని తెలుస్తోంది…అంటే సీనియర్లుగా ఉన్నవారిని ప్రభుత్వంలో కొనసాగిస్తే బెటర్ అని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డిలతో పాటు కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కన్నబాబు లాంటి వారిని కొనసాగిస్తే ప్రభుత్వానికి అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. కానీ ఇందులో ఎంత నిజముందో ఇప్పుడే తెలిసే అవకాశం లేకపోలేదు…కానీ కొందరు మంత్రులకు తమ పదవులు పోతాయని బాగా క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు వారు ఒకటే అనుకుంటున్నారు…తప్పిస్తే అందరినీ మంత్రివర్గం నుంచి తప్పిస్తే బెటర్ అని భావిస్తున్నారు.

అలా చేస్తేనే కనీసం తమ పదవులు పోయిన పరువు పోకుండా ఉంటుందని, అలా కాకుండా కొందరిని మంత్రులుగా కంటిన్యూ చేయడం వల్ల, పదవులు పోయినవారికి ఇబ్బంది అవుతుందని, అంటే ఏదో తప్పులు చేస్తే పదవులు పోయాయని ప్రజలు భావించే అవకాశం ఉందని, అలాగే ప్రతిపక్ష టీడీపీ సైతం అదేవిధంగా విమర్శలు చేస్తుందని, కాబట్టి మొత్తం మంత్రివర్గాన్ని తప్పిస్తే బెటర్ అని కొందరు మంత్రులు కోరుకుంటున్నారట. మరి చూడాలి చివరికి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

Read more RELATED
Recommended to you

Latest news