ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రారంభించిన రష్యా నెల రోజులు గడిచిన ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకోలేకపోయాయి. కీవ్ నగరం చుట్టూ నెలరోజుల నుంచి కాపు కాసి ఆక్రమించుకునేందుకు ప్రయత్నించినా… రష్యా బలగాలకు పట్టు చిక్కలేదు. దీంతో కీవ్ సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు, పట్టణాలపై తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాయి. అయితే ప్రస్తుతం కీలక పరిణామం చోటు చేసుకుంది. కీవ్ ను స్వాధీనం చేసుకోలేక తోకముడిచింది రష్యన్ ఆర్మీ. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి కీవ్ ను స్వాధీనం చేసుకుందాం అనుకున్న రష్యన్ బలగాలకు, ఉక్రెయిన్ సేనలు చుక్కలు చూపించాయి. గెరిల్లా తరహా దాడితో రష్యన్ బలగాల దాడులను తిప్పికొట్టాయి. దీంతో చేసేదేం లేక రష్యన్ బలగాలు కీవ్ నుంచి తరలివెళ్లిపోతున్నాయి. పోరాడలేక రష్యా సైనికులు కొన్ని ప్రాంతాల నుంచి వెనుదిగరుతున్నారు. అయితే తూర్పు ప్రాంతం నుంచి రష్యా దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. డాన్ బాస్ నగరాన్ని విడిచిపోవాలని అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేశారు.
తోకముడిచిన రష్యా .. కీవ్ స్వాధీనం చేసుకోలేక వెనుతిరిగిన బలగాలు
-