పొద్దుతిరుగుడు విత్తనాలు తిన్నారంటే ఈ అనారోగ్య సమస్యలు మాయం

-

పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడిప్పుడో ప్రజలకు ఈ గింజలపై అవగాహన పెరుగుతోంది. డైట్ ఫాలో అయ్యే వాళ్లు.. గుమ్మడిగింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు అంటూ తింటున్నారు. మరి మనం ఈరోజు పొద్దుతిరుగుడు గింజల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం.
పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాల్లో ప్రొటీన్లు, ఫైబర్ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది.
పొద్దుతిరుగుడు గింజలు తినడం వల్ల చర్మం మెరుస్తుంది.
పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ బి6 కూడా ఉంటుంది. ఇది ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది.
గర్భిణులు పొద్దుతిరుగుడు విత్తనాలను తినడం వల్ల కడుపులో బిడ్డ ఎదుగుదల మెరుగ్గా ఉంటుంది.
గాయాలు త్వరగా మానడానికి పొద్దుతిరుగుడు విత్తనాలను చక్కగా ఉపయోగపడతాయి. ఈ విత్తనాల్లో ఫ్లేవనాయిడ్లు, విటమిన్ E అధికంగా ఉంటాయి. వీటిని వారానికి 3-5 సార్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతకు మించి తింటే కడుపు నొప్పి వస్తుందట.
 సైంటిఫిక్‌గా మూడు రకాల సన్‌ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. అవి లైనోలెయిక్, హైలీ ఒలెయిక్, న్యూసన్. విత్తనాల్లోని మోనోశాచురేటెడ్, శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఆధారంగా వాటిని విడదీశారట..
ఇందులో ఉండే ఇన్సులిన్‌ నిరోధానికి సాయపడుతూ మధుమేహం రాకుండా అడ్డుకుంటాయి. పొద్దుతిరుగుడు గింజలు థైరాయిడ్‌ను దరిచేరనివ్వదు. అదే విధంగా.. క్యాన్సర్‌ని అడ్డుకునే గుణాలు పొద్దుతిరుగుడు గింజల్లో ఎక్కువగా ఉంటాయి.
పొద్దుతిరుగుడు విత్తనాలను రోజూ తింటే రక్తనాళాల్లో ఉండే కొవ్వు తగ్గుతుంది. దీంతో గుండెజబ్బులు రాకుండా ఉంటాయి.
ఈ విత్తనాల్లోని మెగ్నీషియం ఎముకలు గట్టిపడేందుకు ఉపయోగపడుతుంది. ఎముకల జాయింట్లు బాగా పనిచేసేలా ఈ గింజల్లోని కాపర్ సహకరిస్తుంది. అలాగే వీటిని తినడం వల్ల హైబీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
మన వెంట్రుకలకు కావాల్సిన సెలెనియం, ప్రోటీన్స్, విటమిన్ ఈ, బీ వంటి వాటిని జుట్టుకు అవసరం. పొద్దుతిరుగుడు గింజల్లో.. ఈ పోషకాలు అన్నీ ఉన్నాయి. జుట్టు బాగా పెరిగి… హెయిర్ లాస్ అరికట్టవచ్చు. జుట్టు తెల్లబడే సమస్యకు కూడా ఈ గింజలు చక్కటి పరిష్కారం అవుతాయి.
ఈ సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆస్త్మా మరియు ఆర్థరైటిస్ ను తగ్గిస్తాయి..కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది.
వీటి ధర కూడా సామాన్యులుకు కొనగలగే రేంజ్ లోనే ఉంటుంది. జంక్ ఫుడ్స్ తినే బదులు వారానికి నాలుగు రోజులు చక్కగా వీటిని నానపెట్టుకుని తింటే.. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version