జిఎస్టీ కౌన్సిల్ లో కీలక నిర్ణయాలు, వాటిపై తగ్గింపు…!

-

43వ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలను కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కరోనా సంబంధిత పరికరాల పై పన్ను మినహాయింపు సమస్యల నేపధ్యంలో దీనిపై కౌన్సిల్ సుదీర్ఘంగా చర్చించింది. అనేక సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. కరోనా చికిత్స లో ఉపయోగించే సహాయక వస్తువుల దిగుమతి పై 2021 ఆగస్టు 31 వరకు జీఎస్టీ మినహాయించాలని కౌన్సిల్ నిర్ణయించింది.

రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాల ద్వారా వచ్చేవి అయినా, రాష్ట్రాలు వాటిని కొనుగోలు చేసి దిగుమతి చేసుకోవటానికి మినహాయింపు ఇవ్వాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఈ మినహాయింపు ఆగస్టు 31 వరకు పొడిగించబడింది. ఇప్పటివరకు రాష్ట్రాలు ఉచితంగా దిగుమతి చేసుకుంటున్నప్పుడే ఐజిఎస్టి మినహాయింపు లభించింది. బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మందు ఆంఫోటెరిసిన్ ని జీఎస్టీ మినహాయింపు జాబితాలో చేర్చారు. వైద్య పరికరాలు, మందులపై జీఎస్టీ రేట్లు తగ్గించే విషయం పై కేంద్ర మంత్రుల బృందం జూన్ 8 న లేదా అంతకు ముందు 10 రోజుల్లోపు తమ నివేదికను సమర్పిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news