ఇప్పటి వరకు దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం పార్లమెంట్‌కు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలలో ఒమైక్రాన్ వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు దేశంలో ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదు. అనుమానాస్పద కేసులను వెంటనే పరీక్షిస్తున్నాం అని, పాజిటివ్ వస్తే జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపుతున్నాం. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని రాజ్యసభలో మన్సుఖ్ మాండవీయ ప్రకటన చేశారు.
కొత్త వేరియంట్‌పై ప్రపంచవ్యాప్తంగా పరిణామాల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేస్తున్నట్లు మాండవీయ తెలిపారు. పోర్టులపై నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు. ఒమిక్రాన్‌పై అధ్యయనాలు జరుగుతున్నాయని రాజ్యసభలో ప్రశ్నోత్తరాలసమయంలో కేంద్ర మంత్రి తెలిపారు.