Unstoppable With NBK PROMO :సై అంటే సై అంటున్న బాలయ్య….

-

మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ తో ఇప్పటివరకు వెండితెరపై అదరగొట్టిన నందమూరి బాలకృష్ణ…. సరి కొత్త అవతారం ఎత్తుతున్నారు. అటు సినిమాలు తీస్తూనే ఇటు బుల్లితెరపై సందడి చేయడానికి రెడీ అయిపోయారు బాలయ్య. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా… నందమూరి బాలయ్య తో అన్ స్టప బుల్ టాక్ షో నూ స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఈ షో నుంచి తాజాగా ఓ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. తాజాగా ఈ షో కు సంబంధించిన ప్రోమో విడుదల చేసింది ఈ సంస్థ అహ.

” మాటల్లో ఫిల్టర్ ఉండదు. సరదా లో స్టాప్ ఉండదు. సై అంటే సై. నై అంటే నై. దెబ్బకు థిమ్మింగ్ మారిపోవాల ” అంటూ బాలకృష్ణ చెప్పే డైలాగులు ప్రోమో లో అందరిని ఆకట్టుకున్నాయి. కాగా ఈ షో తొలి ఎపిసోడ్ వచ్చే నెల అంటే నవంబర్ మాసం 4 వ తేదీన ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ప్రసారం కానుంది. మొత్తం 12 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రోమో అదిరి పోవడంతో .. ఈ షో ఎలా ఉండబోతుంది…? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే షో కు మొదటి గెస్ట్ ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఫస్ట్ గెస్ట్ అని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version