ఈవారం థియేటర్‌, ఓటీటీలో వచ్చే చిత్రాలివే!!

-

ఈ వారం సందడి చేసేందుకు మరికొన్ని సినిమాలు సిద్ధమయ్యాయి. థియేటర్‌, ఓటీటీ వేదికగా అతి త్వరలోనే విడుదల కాబోతున్న సినిమాల జాబితా ఇదీ..

క్రేజీగా ఆది: ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆది సాయికుమార్‌ ఇప్పుడు ‘క్రేజీ ఫెలో’గా రాబోతున్నారు. దర్శకుడు ఫణికృష్ణ సిరికి తెరకెక్కించిన ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఈ నెల 14న విడుదలకానుంది. దిగంగన సూర్యవంశీ, మిర్నా మేనన్‌ కథానాయికలు. ఈ సినిమాలో లవ్‌, కామెడీ, ఎమోషన్‌.. ఇలా అన్ని అంశాలూ ఉన్నాయని ఆది ఇటీవల తెలిపారు.

బాయ్‌ఫ్రెండ్‌ను కొనుక్కోవచ్చు.. విశ్వంత్‌, మాళవిక సతీషన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’. సరికొత్త కథాంశంతో దర్శకుడు కంభంపాటి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఈ నెల 14న విడుదల కానుంది.

సంతు.. రారాజుగా వస్తున్నాడు.. ‘కేజీయఫ్‌’ సిరీస్‌ చిత్రాలతో విశేష ప్రేక్షకాదరణ పొందిన నటుడు యశ్‌. ఆ క్రేజ్‌ను దృష్టిని పెట్టుకొని పలువురు నిర్మాతలు యశ్‌ గతంలో నటించిన సినిమాలను తెలుగులో డబ్‌ చేస్తున్నారు. అలా.. ‘సంతు.. స్ట్రయిట్‌ ఫార్వార్డ్‌’ అనే సినిమా ‘రారాజు’గా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. యశ్‌ సతీమణి రాధిక పండిట్‌ కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ నెల 14న సందడి చేయనుంది. మహేశ్‌ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడ (2016)లో మంచి విజయం అందుకుంది.

రికార్డు సృష్టించిన ‘కాంతారా’ రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘కాంతారా. సెప్టెంబరు 30న కన్నడనాట విడుదలైన ఈ సినిమా రికార్డు సృష్టించింది. దాంతో చిత్ర బృందం ఈ సినిమాని ఇతర భాషల్లోనూ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ఈ నెల 15న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీలో వినోదం పంచేందుకు..

నెట్‌ఫ్లిక్స్‌

  • ది ప్లే లిస్ట్ (అక్టోబరు 13)
  • దోబారా (15)

సోనీ లివ్

  • ఈషో( తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం)
  • గుడ్‌ బ్యాడ్‌ గర్ల్‌ (14)

అమెజాన్‌ ప్రైమ్‌

  • ది రింగ్స్ ఆఫ్ పవర్: ఫైనల్ (14)
  • నేను మీకు బాగా కావాల్సిన వాడిని (14)

ఆహా..

  • నేను మీకు బాగా కావాల్సిన వాడిని (14)

డిస్నీ+హాట్‌స్టార్‌

  • ఆషికానా సీజన్‌ 2
  • హౌజ్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ 8th ఎపిసోడ్‌
  • షి హల్క్‌

Read more RELATED
Recommended to you

Exit mobile version