రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. విజయవాడ టూ చెన్నైకి వందేభారత్‌

-

ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్. రాష్ట్రంలోని రైల్వే కనెక్టివిటీ మరింతగా బూస్టప్ చేసేందుకు కేంద్ర రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో మరో వందేభారత్ రైలు పట్టాలపై పరుగులు పెట్టనుంది. విజయవాడ, చెన్నై మధ్య నడిచే ఈ వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 7న ప్రారంభించనున్నారు. అనంతరం మరుసటి రోజు అనగా జూలై 8న పాసింజర్లకు అందుబాటులోకి రానుంది. గూడూరు, రేణిగుంట, కట్‌పడి ప్రధాన స్టాప్పులు కానున్నాయి. ఈ వందేభారత్ సర్వీసుతో రెండు నగరాల మధ్య దూరం ఇకపై ఆరున్నర గంటలకు తగ్గనుంది. ఇక ఏసీ చైర్ క్లాస్ టికెట్ ధర రూ. 1000-1200 మధ్య, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ రేట్లు రూ. 1500-1700 మధ్య ఉంటాయని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

ఈ రైలును రేణిగుంట మార్గం గుండా నడపాలని విజయవాడ డివిజన్‌ రైల్వే అధికారులు విన్నవించినట్లు సమాచారం. గూడూరు, రేణిగుంట, కాట్పాడి స్టేషన్లలో ఆగుతూ చెన్నై వెళ్లి.. అదే రూటులో తిరిగి రానుంది. విజయవాడ- తిరుపతి మధ్య ప్రయాణించే పాసింజర్స్ రద్దీ నేపథ్యంలో.. ఈ వందేభారత్‌ను రేణిగుంట మీదగా నడపాలని నిర్ణయించారు. . విజయవాడ, చెన్నై మధ్య కేవలం 6.30 గంటల్లోనే ప్రయాణించవచ్చు. ఈ రెండు నగరాల మధ్య నిత్యం ప్రయాణించే ప్రయాణికుల రద్దీని క్లియర్ చేయడానికి మరో రైలు అందుబాటులోకి వస్తుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version