Varun Tej : ట్రెండ్ ఫాలో అవుతున్నామంతే.. పవన్ కల్యాణ్ సినిమాపై వరుణ్ తేజ్ కామెంట్స్ ఇవే..

-

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గని’ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో ఉండబోతున్నది. ఈ పిక్చర్ యాక్షన్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘తమ్ముడు’ చిత్రం గురించి ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు.

ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించిన ఈ మూవీలో .. భారీ తారగణం ఉంది. సునీల్ శెట్టి, ఉపేంద్ర, నదియా, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. వరుణ్ తేజ్ యాక్షన్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మాట్లాడుతూ తాను తన బాబాయ్ పవన్ కల్యాణ్ సెట్ చేసిన ట్రెండ్ ను ఫాలో అవుతున్నానని, క్రియేట్ చేయడం లేదని అన్నాడు. ‘తమ్ముడు’ సినిమా ఇన్ స్పిరేషన్ తోనే తాను ‘గని’ చిత్రం చేసినట్లు పేర్కొ్న్నాడు.

పిక్చర్ లో కీ రోల్ ప్లే చేసిన ఉపేంద్ర అందరికీ ఇన్ స్పిరేషన్ అని చెప్పాడు. సునీల్ శెట్టితో కలిసి పని చేయడం తనకు సంతోషంగా ఉందని పేర్కొన్న వరుణ్.. డెఫినెట్ గా ‘గని’ పిక్చర్ పెద్ద హిట్ కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ బాక్సింగ్ నేపథ్యంలో కథ రాసుకున్నపుడు, సినిమా తీస్తున్నపుడు తనకు దొరికిన రెఫరెన్స్ పాయింట్ జనసేనాని ‘తమ్ముడు’ చిత్రమని తెలిపారు. ప్రతీ ఒక్కరు జీవితంలో ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తారో అటువంటి సమస్యలనే ‘గని’ చిత్రంలో కథానాయకుడి పోషిస్తాడని చెప్పారు కిరణ్. ఈ పిక్చర్ బ్యూటిఫుల్ హీరోయిన్ తమన్నా భాటియా స్పెషల్ సాంగ్ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version