వీరనారి.. లక్ష్యమే ధ్యేయంగా.. జ్యూసులు అమ్మిన చోటే ఎస్సైగా బాధ్యత.. ఈ మహిళ సక్సెస్ స్టోరీ..!

-

జీవితమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు.. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. అవరోధాలు ఎదురైనా.. ఆఖరికి మనం నమ్మిన వాళ్లే నిలువునా ముంచెత్తినా సరే ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు దాన్ని చేరుకోవడంలో వెనుకడుగు వేయకూడదు.. మీ లక్ష్యమే ధ్యేయంగా ముందడుగు వేసినప్పుడు లక్ష్యాలను ఛేదించడమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా కూడా నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా లక్ష్యసాధన కోసం పోరాడి విజయం సాధించిన ఎంతోమంది నారీమణులు నేడు భారతదేశానికి వెన్నెముకగా నిలబడ్డారు అని చెప్పడంలో సందేహం లేదు.

ఇక ఈ క్రమంలోనే అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరుగునప్పుడే భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది అని పెద్దలు చెప్పినా.. ఆడది తిరుగుబడితేనే విజయం సాధిస్తుందని.. అదే అసలు సిసలైన స్వాతంత్రం అని ఇటీవల ఎంతో మంది నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోని ఒక మహిళ తన లక్ష్యాన్ని సాధించడం కోసం నిమ్మ రసాన్ని అమ్మిన చోటే పోరాడి అక్కడే ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు కూడా..ఇక ఇప్పుడు ఆమె సక్సెస్ స్టోరీ ని ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.

పూర్తి వివరాల్లోకి వెళితే తిరువనంతపురం జిల్లాలోని కంజిరాంకులంకు చెందిన ఎస్.పీ. ఆనీ.. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా తల్లిదండ్రులను కూడా ఎదిరించింది.ఇక పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాలకు కొడుకు జన్మించాడు. అయితే తనకు కొడుకు పుట్టగానే తన భర్త వదిలి వెళ్లడంతో ఆమెను తన తల్లిదండ్రులు కూడా చేర తీయలేదు.

ఇక ఇలా కట్టుకున్న వాడు వెళ్లిపోవడం.. కన్నవాళ్ళ దూరం పెట్టడంతో ఒంటరిగా మిగిలిపోయింది. దీంతో తన అమ్మమ్మ చెంత ఉన్న ఆమె డిగ్రీ పూర్తి చేసింది. ఇకపోతే కొన్ని రోజుల తర్వాత అమ్మమ్మ నుంచి దూరమైన ఈమెకు ఎక్కడ ఉండడానికి కనీసం అద్దె ఇల్లు కూడా దొరకలేదు. ఒకవైపు బాబుని చూసుకుంటూనే మరొకవైపు చిన్నాచితక పనులు చేస్తూ దూరవిద్య ద్వారా పీజీ పూర్తి చేసింది.

ఇక ఆ తర్వాత వర్కాలా పట్టణంలో నిమ్మరసం , ఐస్ క్రీం అమ్మడం ప్రారంభించారు ఆనీ.. ఇక 2016లో పోలీస్ నియామకాల నోటిఫికేషన్ వచ్చినప్పుడు తన బంధువుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ఈమె మొదట్లో ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. కానీ బంధువుల ప్రోత్సాహంతోనే పరీక్షలకు దరఖాస్తు చేసి ఫిజికల్ టెస్టులలో ఉత్తీర్ణత సాధించారు కూడా.. అంతేకాదు పరీక్షలలో కూడా ఉత్తీర్ణత సాధించి ఎస్ఐ ట్రైనింగ్ కూడా పూర్తి చేశారుఇక ఈ విధంగా పోలీస్ ట్రైనింగ్ అనంతరం ఒకప్పుడు ఎక్కడైతే నిమ్మరసం, ఐస్ క్రీమ్ అమ్ముకున్నారో అక్కడే ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఇలా ఎవరు కాదన్నా ఒంటరిగా పోరాటం చేసిన ఈమె నేడు ఉన్నత స్థాయి ఉద్యోగంలో చేరి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news