Venkatesh : వెంకటేష్ కొడుకు సినిమా ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన వెంకీ మామ..

-

శైలేష్ కోలన్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ తాజాగా నటిస్తున్న చిత్రం సైంధవ్. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .ఇందులో హీరోయిన్గా శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుంది. ఈ సినిమా వెంకటేష్ కి 75వ చిత్రం కావడం విశేషం. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో వెంకటేష్ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లలో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన వెంకటేష్ ని తన కొడుకు అర్జున్ గురించి ఓ విలేఖరి అడిగారు.

మీ అబ్బాయి అర్జున్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారని ఓ విలేఖరి అడిగారు. దీనికి బదులు ఇస్తూ తను చదువుకుంటున్నాడు. ఎవరైనా సరే ముందు చదువుకొని ఆ తర్వాత ఏం చేయాలనే దాని గురించి ఆలోచించాలని అన్నారు. కాగా విక్టరీ వెంకటేష్ సినిమాల్లోకి రాకముందు తన ఎడ్యుకేషన్ విదేశాలలో పూర్తి చేసుకొని, తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు వెంకీ కొడుకు అర్జున్ కూడా ఇదే బాటలో వెళ్ళనున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికీ సీనియర్ హీరోలైన చిరంజీవి ,నాగార్జున తనయులు సినీ అరంగేట్రం చేశారు. ఇక మిగిలిన ఇద్దరు హీరోలు బాలకృష్ణ వెంకటేష్ వారసులు ఎప్పుడు వస్తారని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సంవత్సరంలోనే బాలకృష్ణ తనయుడు సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version