‘కరణ్’ షోలో విజయ్ దేవరకొండ బోల్డ్ ఆన్సర్స్..ఆశ్చర్యపోయిన అనన్యా పాండే!

-

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్ షో’ సీజన్ 7 ప్రజెంట్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమవుతోంది. ఈ సీజన్ కు గెస్టులుగా ఇటీవల సమంత, అక్షయ్ కుమార్ లు హాజరై పలు విషయాలు పంచుకున్నారు. తాజాగా రౌడీ హీరో ‘లైగర్’ విజయ్ దేవరకొండ, బ్యూటిఫుల్ హీరోయిన్ తో కలిసి ఈ షోకు వెళ్లారు.

ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. సదరు వీడియోలో కరణ్ జోహార్ ..విజయ్, అనన్యలను బోల్డ్ క్వశ్చన్స్ అడిగినట్లు స్పష్టమవుతోంది.

గతంలో జాన్వీకపూర్, సారా అలీ ఖాన్ లు తమకు విజయ్ దేవర కొండ అంటే క్రష్ ఉన్నట్లు పేర్కొన్న వ్యాఖ్యలను షోలో ప్లే చేసినట్లు ప్రోమోలో తెలుస్తోంది. విజయ్ దేవరకొండ పలు ప్రశ్నలకు చాలా బోల్డ్ గా ఆన్సర్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఆదిత్య రాయ్ కపూర్ తో నీకున్న రిలేషన్ ఏంటి? అని కరణ్ జోహార్ ఓపెన్ గా అనన్యా పాండేను ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు ఆమె ఏం సమాధానం చెప్పిందో తెలియాలంటే ఆ ఎపిసోడ్ స్ట్రీమయినపుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడాల్సిందే. విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటించిన ‘లైగర్ ’ఫిల్మ్ ను కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్ కలిసి ప్రొడ్యూస్ చేశారు. వచ్చే నెల 25న ఈ పిక్చర్ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news