పవన్ కల్యాణ్ బాటలో విజయ్ దేవరకొండ..

-

రౌడీ హీరో విజయ్ దేవరకొండ..ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రెండు సినిమాలు చేస్తున్న విజయ్.. మరో వైపున యంగ్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే సినిమా చేస్తున్నారు. ఈ పిక్చర్ టైటిల్ పోస్టర్ తాజాగా విడుదలై ప్రేక్షకలను విశేషంగా ఆకట్టుకుంటోంది.

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్ 23న విడుదల కానున్న ఈ సినిమాలో విజయ్ కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత నటిస్తోంది. కాగా, విజయ్ దేవరకొండ మూవీస్ సెలక్షన్ , డిఫరెంట్ స్టోరిలు ఎంచుకున్న నేపథ్యం అచ్చం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాదిరిగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఓ ఫంక్షన్ లో తనకు తాను ఓ టైటిల్ ఇచ్చుకోవాలనుకుంటే ‘పవర్ స్టార్’ అని ఇచ్చుకుంటానని విజయ్ దేవరకొండ చెప్పాడు. కాగా, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సూపర్ హిట్ అండ్ కల్ట్ మూవీ ‘ఖుషి’ టైటిల్ తీసేసుకున్నారు. అలా మొత్తంగా పవర్ స్టార్ మాదిరిగా డిఫరెంట్ మూవీస్ ను లైనప్ విజయ్ లైనప్ లో పెట్టుకోవడం విశేషం.

తెలంగాణకు చెందిన హీరో విజయ్ దేవరకొండ తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీలో కనిపించాడు. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. కాగా, బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘లైగర్’ షూటింగ్ కంప్లీట్ అయి విడుదల కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాగా, ఈ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ తో మరో పిక్చర్ చేస్తున్నారు. ‘జనగణమన(JGM)’ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ కూడా అయింది. అలా ఓ వైపు లవ్ స్టోరి ‘ఖుషి’ చేస్తూ మరో వైపున దేశభక్తి చిత్రం ‘జనగణమన’ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. చూడాలి మరి.. భవిష్యత్తులో పవన్ కల్యాణ్ మాదిరిగా విజయ్ దేవరకొండ అశేష అభిమానులను తన సొంతం చేసుకుంటారో..

Read more RELATED
Recommended to you

Exit mobile version