దిల్లీ లిక్కర్ స్కామ్ లో తొలి అరెస్ట్

-

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తొలి అరెస్టు నమోదైంది. విజయ్‌ నాయర్‌ అనే వ్యక్తిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో విజయ్‌ నాయర్‌ పాత్ర ఉందని సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. విజయ్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. తెలంగాణలోనూ వరుస తనిఖీలు చేశారు. హైదరాబాద్ లో ప్రముఖ వ్యాపారి వెన్నమనేని శ్రీనివాసరావును విచారించారు. దిల్లీ మద్యం సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైన ప్రాథమిక సమాచారం ఆధారంగా ఈ సోదాలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version