విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తాను-విజయసాయి

-

రైల్వే జోన్ అంశం పై ఎమ్పీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని… రైల్వే జోన్ రావటం లేదనే వార్తలు అవాస్తవమని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ రాష్ట్ర విభజన చట్టం లో ఉన్న హామీ అని… అప్పటి ప్రధానమంత్రి కూడా రాజ్యసభలో ఈ అంశాన్ని స్పష్టం చేశారని తెలిపారు.

ఎంపీల బృందంతో వెళ్ళి కలిసినప్పుడు స్వయంగా రైల్వే శాఖ మంత్రి హామీ ఇచ్చారు… చివరి దశలో ఉంది… త్వరలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చారన్నారు. నిన్నటి సమావేశంలో అసలు రైల్వే జోన్ కు సంబంధించిన ప్రస్తావనే రాలేదు…కేవలం రైల్వే లైన్ పై మాత్రమే జరిగిందని వెల్లడించారు.

కొవ్వూరు మీదుగా తెలంగాణ ప్రాంతాలతో కనెక్ట్ చేయాలనే ప్రతిపాదన పై చర్చ జరుగలేదు.. విభజన చట్టంలోనే ఈ ప్రతిపాదన ఉందన్నారు. విభజన చట్టంలో ఉన్నందున మొత్తం ఖర్చు కేంద్రమే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని.. రైల్వే లైన్ కోసం రాష్ట్ర వాటా ఇవ్వాలని కేంద్రం అడుగుతోందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version