తెలుగు దొంగల పార్టీ ఎల్లోస్ – డర్టీ ఫెలోస్ – విజయసాయిరెడ్డి

-

తెలుగు దొంగల పార్టీ ఎల్లోస్ – డర్టీ ఫెలోస్ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లు చూడటానికి పది రోజులు వైజాగ్ వస్తే తోడేళ్లులా వణికిపోయారు కదరా తెలుగు దొంగల పార్టీ ఎల్లోస్ – డర్టీ ఫెలోస్! అంటూ చురకలు అంటించారు సాయిరెడ్డి.

ప్యాకేజీల కోసం ప్రత్యేక హోదాను టీడీపీ ముసలి నాయుడు తాకట్టు పెడితే ప్రధాని సభావేదిక మీదే ఏపీకి హోదా అడిగినంత కమిట్మెంట్ ఉన్న గుండెరా మా నాయకుడిదని పేర్కొన్నారు. లేనిది ఉన్నట్లు-ఉన్నది లేనట్లు సృష్టించడం పచ్చ కుల పార్టీ టీడీపీ డబ్బా కుల కరపత్రిక “అచేతనరధం” సహజ నైజమని చెప్పారు. కులగజ్జితో కట్టుకథలు అల్లి కట్టడి చేయాలనుకోవడం మూర్ఖత్వం. మీకు అను’కులం’ కాకపోతే ఏది రాసినా ప్రజలు నమ్ముతారనుకోవడం అమాయకత్వమంటూ ట్వీట్‌ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version