కేసీఆర్ నిరాహారదీక్షపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

-

కేసీఆర్ నిరాహారదీక్షపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారు నిరాహారదీక్ష ఘనంగా చేశారని, అందుకే తెలంగాణ సాధ్యమైందని స్వయంగా గొప్పలు చెప్పుకోవడం కన్నా హస్యాస్పదం మరొకటి లేదని పేర్కొన్నారు. ఆయన ఏ దీక్షా చెయ్యలేదన్నది యావత్ ప్రజలకు తెలుసు. ఖమ్మంలో కేసీఆర్ జ్యూసులు తాగితే… విద్యార్థులు, ఉద్యమకారులు, ప్రజలు తిరగబడి తన్నే పరిస్థితి అయనకి వచ్చిందన్నది ఎవలు యాద్ మర్వలే… ఇక నిమ్స్‌లో దొంగ దీక్ష ముచ్చట అందరికీ తెలిసిందేనన్నారు.

ఢిల్లీలో దీక్ష పేరుతో గోల్‌మాల్ కతలు టీఆరెస్‌లో ముఖ్యులందరికీ తెలుసు. ఇక ఈ కేసీఆర్ గారు… చావు నోట్లో తలపెట్టిన.. కోమా దాంక ఎల్లిన.. అని చెప్పేవి మొత్తం అవాస్తవ తుపాకి రాముడి కతలు. ఇవన్నీ విని మంది నవ్వుకుంటున్రు. ఇక ఈ కేసీఆర్ చెబుతున్న ఆ దొంగ దీక్ష కూడా చేసింది 2009ల… తెలంగాణ వచ్చింది 2014ల… ఆ ఝూటా దీక్షకి, ఈ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధం ఏంటో ఎవలికీ సమజ్ కాదు. గీయనేమన్న 2009 నుండి 2014 దాకా దీక్షలోనే కూసున్నడా? ఏమో… మనం అమాయకులగుంటే అట్ల కూడా చెప్పి పబ్లిక్ నెత్తికి టోపీ పెట్టే సమర్థత సంపూర్ణంగా సీఎం గారికి స్వంతమని సంచలన వ్యాఖ్యల చేశారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version