వైరల్‌ వీడియో: పామును గన్‌తో కాల్చాడు.. గురితప్పింది.. పాము ఏం చేసిందంటే..

-

జనరల్‌గానే పాములు మనుషులను చూస్తే భయపడి వాటి ప్రాణరక్షణ కోసం మనల్ని కాటేస్తాయి.. అలాంటిది మన నిజంగానే వాటి ప్రాణాలను తీస్తున్నాం అని పాములు తెలుసుకున్నప్పుడు ఊరికే ఉంటాయా.? ఓ వ్యక్తి కావాలని పామును గన్‌తో షూట్‌ చేశాడు.. అది కాస్త గురి తప్పింది.. రెండు సార్లు కాల్చాడు.. రెండు సార్లు ఫెయిల్‌ అయింది. అంతే పాముకు చిర్రెత్తి ఏం చేసిందంటే..

ఓ వ్యక్తి గన్ తో నాగు పాముపై కాల్పులు జరిపాడు. ఆగ్రహించిన ఆ పాము ఏం చేసిందో చూస్తే భయపడాల్సిందే. ఒక వ్యక్తి కారులో వెళ్తుండగా కచ్చా రోడ్డుపై ఒక నాగు పాము కనిపించింది. దీంతో అతడు తన వాహనాన్ని ఆపాడు. ఆ పాముతో సరసాలాడాలి అనుకున్నాడేమో.. తన దగ్గర ఉన్న రివాల్వర్‌తో పాముపైకి మొదట ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. గురి తప్పడంతో మరో బుల్లెట్‌ను దగ్గర నుంచి ఫైర్ చేశాడు. దీంతో ఆగ్రహించిన పాము ముందుకు పాకుతూ కాటు వేసేందుకు వేగంగా అతని వైపుకు దూసుకొచ్చింది. అంతే మనోడు వీడియో తీయడం ఆపేసి అరుస్తూ పరుగులు తీశాడు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో పెట్టడంతో చూసినవారంతా.. గన్‌తో కాల్చన వ్యక్తిని ఆడేసుకుంటున్నారు. ఇన్ స్టెంట్ కర్మ అన్న యూజర్ ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను ఇప్పటివరకూ 2 లక్షల మంది పైగా వీక్షించారు. నెటిజన్లు కూడా ఘాటుగా, ఫన్నీగా కామెంట్లు చేశారు. గన్‌తో పాముపై కాల్పులు జరపడాన్ని పలువురు విమర్శించారు. వినోదం కోసం తుపాకీతో కాల్చి పామును చంపేందుకు ప్రయత్నించడంపై మండిపడ్డారు. ఈ వీడియో ఆధారంగా చేసుకుని అతన్ని శిక్షించాలని.. జంతువులను హింసించే రైట్‌ అతనికి ఎవరిచ్చారు అని మరికొందరు ఇచ్చిపడేస్తున్నారు. అయినా పోయి పోయి పాములతో ఆటలేంటండి..మరీను..ఆ వీడియోను బట్టి చూస్తే.. ఆ వ్యక్తి పాముకాటుకు బలైనట్లే అనిపిస్తుంది.. మీరు కూడా చూసి చెప్పండి..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version