విరాట్, అనుష్క కాఫీ డేట్.. ఫిదా అవుతున్న నెటిజన్స్

-

విరాట్ కోహ్లీ, అనుష్క జంట అంటే ఇష్టపడని వారుండరు. వాళ్లిద్దరు ఏం చేసినా సెన్సేషనే. ఇద్దరు కలిసి కనిపిస్తే ఇక ఫ్యాన్స్‌కి పండగే. అందుకే వారు ఇండియాలో ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్లాలంటే ఆలోచిస్తారు. ఎందుకంటే అక్కడ ఫ్యాన్స్ అందరూ ఉంటారని. అందుకే ఈ పవర్ కపుల్ విహారయాత్రకు వెళ్లాలంటే విదేశాలకు చక్కేస్తారు.

ఓ సినిమా షూటింగ్‌ కోసం లండన్‌లో ఉన్న అనుష్క శర్మ భర్త విరాట్‌తో కలిసి కాఫీ డేట్‌కి వెళ్లింది. వీరిద్దరు కలిసి కాఫీ తాగుతుండగా ఆ అందమైన దృశ్యాన్ని అక్కడున్న వారు వారి కెమెరాల్లో క్లిక్‌మనిపించారు. ఈ ఫొటోలను అనుష్క తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు ఓ లవ్ ఎమోజీని జత చేస్తూ పోస్ట్ చేసింది.

ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లతో పాటు సెలెబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంకా విరుష్క కాఫీ డేట్‌ ఫొటోపై క్యూట్ రియాక్షన ఇచ్చారు. హార్ట్ ఎమోజీలను జతచేస్తూ వారెంత ప్రేమలో ఉన్నారనేది కనిపిస్తోందని కామెంట్ చేశారు. మరోవైపు ఈ ఫొటోలకు నెటిజన్లు తెగ ఫిదా అవుతున్నారు. ఇక విరుష్క ఫ్యాన్స్‌ అయితే పండుగ చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news