రన్ మెషీన్ కింగ్ విరాట్ కోహ్లి ఫ్యాన్స్ కి బీసీసీఐ షాక్ ఇవ్వనున్నట్లు, ఈ ఏడాది జూన్ 2 నుంచి 29 వరకూ అమెరికా, వెస్ట్ ఇండీస్ వేదికగా జరగబోయే T20 వరల్డ్ కప్లో ఇండియా జట్టు నుంచి విరాట్ కోహ్లిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వెస్టిండీస్ స్లో వికెట్ పిచ్లు విరాట్ కోహ్లికి సూట్ కావని బీసీసీఐ భావిస్తుందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో కింగ్ కోహ్లిని ఒప్పించే బాధ్యతలు అజిత్ అగార్కర్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది.
ఈ వార్తలపై ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ స్పందించారు. త్వరలో జరగబోయే టి20 వరల్డ్ కప్ నుంచి విరాట్ కోహ్లీని తప్పిస్తారని వస్తున్న వార్తలను ఖండించారు. ‘ఆ వార్త నిజం కాకపోవచ్చు. క్రికెట్ను విస్తరించడానికి ట్20 ప్రపంచకప్ ని అమెరికాలో నిర్వహిస్తున్నారు. న్యూయార్క్ వేదికగా భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రపంచంలోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ రన్ మెషీన్ విరాట్ కోహ్లి. అతను కచ్చితంగా జట్టులోకి ఎంపిక అవుతారు’ అని స్టువర్ట్ బాడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.