ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి రావాలా వద్దా అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. గత వాతావరణ నివేదిక ప్రకారం ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే రావాలి.. కానీ మళ్లీ మనుసు మార్చకున్నాయో ఏమో గానీ రావాల్సిన సమయం వచ్చినా నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి రావడం లేదు. అయితే తాజాగా విశాఖపట్నంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
దట్టమైన మేఘాలు అలముకోవడంతో ఉరుములు, మెరుపులతో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖలో దిగాల్సిన విమానాలను హైదరాబాద్ కు మళ్లించారు. ఢిల్లీ నుంచి విశాఖ రావాల్సిన ఓ విమానాన్ని అధికారులు వెనక్కి మళ్లించారు. ఈ విమానంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ ఉన్నారు. ఇక, ఢిల్లీ విమానం రాకపోవడంతో మరో కేంద్రమంత్రి హర్ దీప్ సింగ్ పూరీ విశాఖలోనే నిలిచిపోయారు.