వైజాగ్ ఎయిర్ పోర్ట్ లోనే ఈగలు తోలుకునే పరిస్థితి ఇంకో ఎయిర్ పోర్ట్ అవసరమా జగన్ అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నెల్లిమర్ల వారాహి విజయభేరి బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అధికారంలోకి వచ్చాక ఎయిర్ పోర్ట్ క్యాన్సల్ అయింది అని భూముల ధరలు పడిపోయేలా చేసి, బినామీలతో ఆ భూములు చేజిక్కిచ్చుకుని మళ్ళీ అక్కడే ఎయిర్ పోర్ట్ శంఖుస్థాపన చేసాడు అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇంటి నుండి బయటకు రాని మా ఇంటి ఆడపడుచులని కూడా తిట్టారు. ప్రజలకోసం భరించాం..అమరావతికి 35 వేల ఎకరాలు కాదు 55 వేల ఎకరాలు కావాలన్న జగన్, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులన్నాడు, ఉత్తరాంధ్ర వెనుకబడుతుందన్నాడు కానీ ఈ రోజుకి మన రాష్ట్రానికి రాజధాని లేదు..రామతీర్థంలో శ్రీరామ చంద్రులవారి విగ్రహం తల నరికేస్తే పూజారి గారు పట్టుకుని ఏడుస్తున్న చిత్రం నాకు మనసులో ఉండిపోయింది.వైసీపీ దోపిడీ వల్ల స్థానికులు నెల్లిమర్లలో ఇల్లు కట్టుకోవాలన్నా స్థలం దొరకని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.