బాక్స్ ఆఫీస్ బద్దలు అయ్యేలా ‘వాల్తేరు వీరయ్య’ రాబోతున్నాడు..!!

-

ఒకప్పుడు చిరంజీవి సినిమా వస్తుంది అంటే హంగామా మామూలుగా ఉండేది కాదు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య’  చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతికి విడుదల చేసేలా థియేటర్ల అగ్రిమెంట్ కూడా జరిగిపోయినట్లుగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

సంక్రాంతికి సినిమా రిలీజ్ ని అనౌన్స్ చేశారు కానీ ప్రమోషన్స్ మాత్రం పెద్దగా చెయ్యట్లేదు అని మెగా ఫాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మైత్రి మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచడానికి రెడీ అయ్యారు. ప్రమోషన్స్ కూడా సూపర్ ల్లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట. రవితేజ కూడా అన్నయ్య సినిమా కోసం ఏదైనా చేస్తా అని వాగ్దానం చేశాడట.

ఇక మెగా అభిమానులకే కాదు మొత్తం సినీ అభిమనలకే జోష్ తెచ్చేలా, ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ‘మాస్ మహారాజ రవితేజ’ టీజర్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 9న రవితేజ పాత్రకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేసి, ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేయనున్నారు. అలాగే డిసెంబర్ 8న ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు అని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version