ఈ దేశాలకు వీసా లేకుండానే మనం వెళ్ళచ్చు..!

-

ట్రావెలింగ్ చేయడం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. చాలా మంది వివిధ ప్రాంతాలని చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. విదేశాలకి కూడా వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా ఏదైనా దేశానికి వెళ్లాలనుకుంటున్నారా..? వీసా లేకుండానే ఈ దేశాలకు వెళ్ళచ్చు మరి వీసా లేకుండా ఏఏ ప్రదేశాలకి వెళ్లొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

స్వాల్బార్డ్‌ని:

నార్వీజియన్ ద్వీప సమూహమైన స్వాల్బార్డ్‌ని చూడాలంటె వీసా అక్కర్లేదు. ఈ ప్రదేశం కూడా చాలా బాగుంటుంది. వ్యాపారం లేదా పర్యాటకం పరంగా వెళ్లాలని మీరు అనుకుంటే వీసా అక్కర్లేదు.

జమైకా:

ఇక్కడకి వెళ్లాలనుకుంటే వీసా అవసరం లేదు. భారతీయులు పాస్‌ పోర్ట్‌ పై ఇమ్మిగ్రేషన్ అధికారులు 30 రోజులు చెల్లుబాటు అయ్యేలా స్టాంప్ వేస్తారు. ఎలాంటి వీసా అక్కర్లేదు.
30 రోజుల వరకు ఎంచక్కా ఈ ప్రదేశాన్ని చూసి వచ్చేయచ్చు.

సెర్బియా:

30 రోజులు సెర్బియాలో వీసా లేకుండా ఇండియన్స్ ఉండవచ్చు. ఏదైనా దేశం వెళ్లాలని అనుకునే వారు వీసా లేకుండా సెర్బియాను చూసి వచ్చేయచ్చు.

ట్యునీసియా:

ఇక్కడకి కూడా ఏ వీసా లేకుండానే వెళ్లిపోవచ్చు. వ్యాపారం లేదా పర్యాటకం పరంగా వెళ్తే వీసా అవసరం లేదుట. కానీ ఇక్కడ మూడు నెలలకు మించి ఉండకూడదు.

సెయింట్ కిట్స్ అండ్ నేవిస్:

ఇక్కడకి కూడా ఏ వీసా లేకుండానే వెళ్లిపోవచ్చు. వ్యాపారం లేదా పర్యాటకం పరంగా వెళ్లాలని మీరు అనుకుంటే వీసా అవసరం లేదు. ఎలాంటి వీసా లేకుండానే విహరించి రావచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version