సుబ్రహ్మణ్యం మరణం విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: మంత్రి మేరుగ నాగార్జున

-

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణం విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున. సంఘటన జరిగిన వెంటనే పక్కదారి పట్టకుండా చట్టం కింద అంతా సమానులే అంటూ బాధ్యులు ఎవరైనా శిక్ష పడాల్సిందేనన్న ముఖ్యమంత్రి జగన్ కి ధన్యవాదాలు తెలియజేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసి వారికి మనోధైర్యం కల్పించాలని సీఎం ఆదేశించారని తెలియజేశారు.

సుబ్రహ్మణ్యం దళితుడు అని, అతని విషయంలో ఎమ్మెల్సీ పై అనుమానం వ్యక్తం చేస్తే కేసు నమోదు చేశామని, అది మా పార్టీలో ఉన్న నైతికత అన్నారు. ఒకప్పుడు దళితులపై అఘాయిత్యాలు, దాడులు జరిగితే అవి చేయించిన చంద్రబాబు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దళిత సంక్షేమాన్ని కోరిన నాయకుడు జగన్ ఒక్కడేనని, దళితులకు జగన్ ఒక పెట్టని కోట లాంటి వాడని అన్నారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి వందశాతం అండగా ఉంటామని తెలియజేశారు.

చిత్తశుద్ధితో కేసుని విచారణ చేస్తున్నామని, దళితుల మీద దాడి చేస్తే ఎలాంటివాడైనా శిక్షించి తీరుతాం అన్నారు. అనంతబాబు ని కేసులో ముద్దాయిగా నిలబెడతామని, తప్పు చేస్తే కచ్చితంగా శిక్ష పడుతుంది అన్నారు. చంద్రబాబు గుడ్డ కాల్చి మీద పడేయాలని చూస్తే ఊరుకోవడానికి సిద్ధంగా లేమన్నారు. దళిత కుటుంబంలో ఎవరూ పెట్టకూడదు అని చెప్పిన నీచుడు చంద్రబాబు అని విమర్శించారు. టిడిపి నేతలు దళితులను అడ్డంపెట్టుకుని కపట నాటకాలు ఆడాలని చూస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version