ఇద్దరి మధ్య బంధం శృంగారానికి దారి తీయాలంటే వారిద్దరి మధ్య ఎనలేని ఆకర్షణ ఉండాలి. అట్రాక్షన్ లేకపోతే ప్రేమా పుట్టదు. శృంగారమూ జరగదు. అట్రాక్షన్ ని చాలామంది తీసిపారేస్తారు కానీ, అదొక్కటి లేకపోతే ఆ బంధానికి అసలు పేరే ఉండదు. అట్రాక్షన్ అనేది ఎలా అయినా ఉండవచ్చు. లుక్స్ కానీ, ప్రవర్తన గానీ, వ్యక్తిత్వం కానీ.. ఇంకా ఏదైనా అయ్యుండవచ్చు.
ప్రస్తుతం ఆడవాళ్ళను అట్రాక్ట్ చేసే మగాళ్ళలోని అంశాలు ఇక్కడ చూద్దాం.
నమ్మకంగా ఉండండి
కాన్ఫిడెంట్ గా కనిపించే మగాళ్ళు ఆడవాళ్ళకు నచ్చుతారు. ఏదైనా సరే నమ్మకంగా ఉండాలి.
అదే కాదు అవతలి వారిలో ఆడతనాన్ని గుర్తు చేసే మగవాళ్ళకు చాలా తొందరగా అట్రాక్ట్ అవుతారని కొందరు చెబుతుంటారు. మాటల శైలితో అవతలి వారిని ఈజీగా పడగొట్టేవారికి అట్రాక్ట్ అవుతారు. అలాగే తమని నవ్వించే వారికి కూడా పడిపోయే అవకాశం ఎక్కువ.
ఇంకా, ఆడవాళ్ళను అమితంగా ఆకర్షించాలంటే,
మిస్టర్ పర్ఫెక్ట్ అయి ఉండకూడదు
అవును, మీరు చెప్పింది నిజమే. మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉండేవారు అంత తొందరగా ఆడవాళ్ళ మనసుల్లో చేరుకోలేరని చాలామంది వాదన. గతంలో మిస్టర్ పర్ఫెక్ట్స్ మాత్రమే ఆడవాళ్ళను అట్రాక్ట్ చేయగలరని అనుకునేవాళ్ళు. కానీ కాలం చాలా మారింది. ఆలోచనలు మారాయి. ఆడవాళ్ళు సంపాదిస్తున్నారు. ఎవరిని ఎంచుకోవాలో వారికి ఒక అవగాహన ఉంది.
అవతలి వాళ్ళు వెళ్ళని దారిలో నువ్వు వెళ్ళినపుడు
పడగొట్టాలని ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తారు. అందరూ వెళ్ళిన దారిలో నువ్వు వెళితే బొక్క బోర్లా పడిపోతారు. కొత్తదారిలో వెళ్ళినపుడు తొందరగా అట్రాక్ట్ అవుతారని మరికొందరు చెబుతారు.