తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే..

-

ప్రముఖ టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న గత కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం పై ఎన్నో వదంతులు వినిపిస్తూనే వస్తున్నాయి. కుటుంబ సభ్యుల సైతం ఆయన కోరుకుంటున్నారు అని చెప్పుకొస్తున్నారు. అయితే తాజాగా ప్రముఖ హీరో కళ్యాణ్ రామ్ నందమూరి తారకరత్న హెల్త్ పై అప్డేట్ ఇచ్చారు..

 

తెలుగుదేశం నాయకుడు నారా లోకేష్ గత నెలలో కుప్పంలో నిర్వహించిన యువగలం పాదయాత్రలో పాల్గొన్న ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలోనే ఆయనకు గుండెపోటు వచ్చినట్టు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే మొదట హైదరాబాదులో ఆసుపత్రిలో ఆయన చేర్చగా తర్వాత మాత్రం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాల ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం పై ఎన్నో వదంతులు వినిపిస్తూ వస్తున్నాయి. డాక్టర్లు సైతం అతను క్షేమంగానే ఉన్నారని చెబుతున్నప్పటికీ అతని ఆరోగ్యం పై ఒక స్పష్టత రాలేదు. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన కళ్యాణ్ రామ్.. “తారకరత్నకు బెస్ట్ ట్రీట్ మెంట్ అందుతోంది. డాక్టర్లు నిత్యం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా కావాల్సిన ఏర్పాట్లు చూస్తున్నారు. త్వరలో కోలుకుంటారని భావిస్తున్నాను. ఈమేరకు దేవుడిని ప్రార్థిస్తున్నాం. తారకరత్న హెల్త్ పై డాక్టర్లు అప్డేట్ ఇస్తే బాగుంటుంది. మీ అందరి ఆశీస్సులతో కోలుకుంటారని ఆకాంక్షిస్తున్నాం… “అని చెప్పుకొచ్చారు..

అయితే ఇతని ఆరోగ్యం పై నందమూరి కుటుంబంతో పాటు ఆయన అభిమానులు సైతం తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. అయితే దాదాపు 20 రోజులు గడుస్తున్నప్పటికీ అతను ఇంకా ఆసుపత్రిలో ఉండటంపై కొన్ని సందర్భాల్లో అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వినిపించడంతో ఆయన అభిమానులు కలవర పడుతున్నారు. ఇదే విషయంపై ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ సైతం స్పందించి అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎప్పటికప్పుడు అప్డేట్లను డాక్టర్లు అందిస్తున్నారని చెప్పుకొచ్చారు..

Read more RELATED
Recommended to you

Latest news