ఈ తెలివి ముందు ఏమైంది…. నటుడు నాగబాబుపై ట్రోల్స్

-

సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉండే నాగబాబు తరచూ ఏదోఒక వివాదంలో ఉంటారు.గతంలో కోడుకు సినిమా ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ.. పొట్టిగా ఉండే వాళ్ళు పోలీస్ పాత్రకి సెట్ అవ్వరు అని ఎన్టీఆర్ అభిమానులు హర్ట్ అయ్యేలా మాట్లాడారు. ఇక దీనిపై ఫ్యాన్స్ నుండి వ్యతిరేకత ఏర్పడడంతో క్షమాపణలు కోరారు. తాజాగా మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై నాగబాబు ఎక్స్(ట్విట్టర్) లో ఓ ట్వీట్ చేశారు.

చాల పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్.. అసలు స్క్రిప్ట్‌లా అనిపించడంలేదు అని ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే ఏమైందో తెలీదుగానీ ఆ ట్వీట్‌ని తొలిగించి.. నాగబాబు మరో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో జగన్ మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి అప్రజాస్వమిక చర్య అని పేర్కొన్నారు.

జనసేన ప్రధాన కార్యదర్శిగా నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను,రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శలుండచ్చు కాని ఇలా భౌతికంగా దాడి చేయడం హేయమైన చర్య చట్టరీత్యా నేరం,పోలీసు వారు ఈ దాడికి పాల్పడిన దుండగులకి కఠిన శిక్ష వేయాలని మరోమారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను అని ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.కాగా మొదట చేసిన ట్వీన్ డిలీట్ చేసి రెండవసారి నాగబాబు చేసిన ట్వీట్‌పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తెలివి ముందు ఏమైంది, అడ్డంగా మనిషి పెరిగితే సరిపోదు అని, ట్వీట్ ఎందుకు డిలీట్ చేసావ్ రా స్నేక్‌గా, మీరు ఇలా ఉన్నారు కాబట్టే మీ రాజకీయ భవిష్యత్తు ఇలా ఏడ్చింది, యాక్ తూ అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version