ఈ మధ్య కాలంలో వాట్సాప్ వాడకం ఎక్కువ అయ్యింది.. కస్టమర్లకు కావలసిన ఫీచర్ల తో కస్టమర్ల డేటాను సెక్యుర్ గా ఉంచుతున్న నేపథ్యంలో రోజు రోజుకు వినియోగదారులు పెరిగి పోతున్నారు. మొదట మెసేజ్లు మాత్రమే చేసుకోవడానికి వీలయ్యేది. ప్రస్తుతం అది ఆ పరిధిని దాటింది. పేమెంట్లు చేసుకునే సౌలభ్యాన్ని కూడా Whatsapp తన యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే వాట్సప్ వినియోగం ఎక్కువైపోయింది. జనాలు చాలా వరకు తమ పనులను ఈ మెసేజింగ్ యాప్ ద్వారానే చేసేసుకుంటున్నారు. అయితే కొంత మంది యూజర్లకు Whatsapp షాకిచ్చేందుకు కీలక ప్రకటన చేసింది.
దీపావళి అంటే అక్టోబర్ 24 నుంచి కొన్ని మొబైల్స్లో తన సేవలను నిలిపివేయనున్నట్టు తాజాగా Whatsapp ప్రకటించింది. iPhone 5, iPhone 5C మొబైల్స్తోపాటు iOS 10, iOS 11 ఆపరేటింగ్ సిస్టమ్తో పని చేస్తున్న ఐఫోన్లలో వాట్సప్ సేవలు నిలిచిపోనున్నట్టు వెల్లడించింది. అలాగే కొన్ని ఆన్రాయిడ్ మొబైల్స్లో కూడా దీపావళి నుంచి వాట్సప్ పని చేయదని చెప్పింది. ఆన్రాయిడ్ వర్షన్ 4.1 లేదా అంతకంటే తక్కువ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ల మీద పని చేస్తున్న ఆన్రాయిడ్ మొబైల్స్లో తన సేవలను నిలిపి వేస్తున్నట్టు Whatsapp పేర్కొంది.
ఈ ఫోన్లను ఉపయోగిస్తున్న Whatsapp యూజర్లు.. వీలైతే తమ ఫోన్ సాఫ్ట్వేర్లను అప్డేట్ (Software Update) చేసుకోవాలని సూచించింది. మొబైల్ ఫోన్స్లో సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవడానికి అవకాశం లేకపోతే.. మెరుగైన సేవల కోసం కొత్త మొబైల్స్ను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుతం వాట్సప్ kaiOS 2.5.0 వర్షన్ మీద పని చేస్తున్నట్టు వెల్లడించింది.. మన దేశంలో దాదాపు 600 బిలియన్ల మంది ఈ వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు.. ఇప్పుడు అందరికి వాట్సాప్ అప్డేట్ ను ఇస్తుంది..