ఈసారి దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది..? ఏం చేస్తే మంచిది..?

-

హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో దీపావళి పండుగ ఒకటి. దీపావళి నాడు మంచి జరగాలని.. చెడు దూరం అయిపోవాలని అందరూ పండుగను జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది పండుగ ఎప్పుడు వచ్చింది అనేది చూస్తే.. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24న వచ్చింది. అయితే అక్టోబర్ 25న సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుందిట.

 

అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుందని.. దీని మూలంగా అమావాస్య ఉండదు. కనుక 24న రాతంత్రా అమావాస్య గడియలు వున్నాయి కనుక దీపావళి అక్టోబర్ 24న అయ్యింది. ఆ రోజు పండుగ చేసుకోవాలి. పండితులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా 24న ఉదయం చతుర్దశి వుంది. రాతంత్రా అమవాస్య మాత్రం ఉంటుంది.

దీపావళి నాడు ఇవి చాలా ముఖ్యమట:

ఏ పండగైనా ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే దీపావళికి కూడా ఇంటిని శుభ్రం చేసుకుని అందంగా అలంకరించుకోవడం ఎంతో ముఖ్యం.
ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడు లక్ష్మీ దేవి ఇంటికి వస్తుంది అందుకనే చెత్తాచెదారాన్ని తొలగించాలని పండితులు అంటున్నారు.
అలానే లక్ష్మీ దేవిని మీరు పెట్టేటప్పుడు ఉత్తరం వైపు ఫేసింగ్ ఉండేటట్టు చూసుకుని పెట్టండి. దీపావళి నాడు లక్ష్మి దేవికి పూజ చేయడం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా దీపావళికి వ్యాపారాలు లక్ష్మీ దేవిని పూజిస్తారు.
అదే విధంగా లక్ష్మీ దేవి ముందు ఆభరణాలు, డబ్బులు వంటివి పెడితే మంచిది.
పూజ గదిలో దీపాలని పెట్టడం లేదా లైట్లని పెట్టడం లాంటివి చేయాలి.
ఇల్లంతా కూడా దీపాలతో అలంకరిస్తే చాలా మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version