బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి జబర్దస్త్ ఎప్పుడూ ముందుంటుంది అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే చాలామంది తమ ప్రతిభను నిరూపించుకుంటూ సినిమాలలో కూడా అవకాశాలను సంపాదించుకుంటున్నారు. ఇకపోతే జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న బుల్లెట్ భాస్కర్ ఒక అమ్మాయి చేతిలో మోసపోయారట. అంతేకాదు ఆ అమ్మాయి మీద ప్రేమతో అమ్మాయి మోసం చేయడంతో చివరికి పిచ్చెక్కి రోడ్ల మీద తిరగానంటూ ఎమోషనల్ అయ్యారు.. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
స్వతహాగా బుల్లెట్ భాస్కర్ ఎప్పుడూ కూడా తన వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ చెప్పడు..కానీ ఇటీవల ఆయన తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ గతంలో రెండు సంవత్సరాల పాటు ఒక అమ్మాయిని చాలా సిన్సియర్ గా ప్రేమించడంతోపాటు ఆమెతో కలిసి జీవించాను.. ఆ తర్వాత ఆమె మోసం చేయడంతో పిచ్చెక్కి ఎన్నో ఊర్లు తిరిగాను. ఇక అదే సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాను అని తెలిపారు బుల్లెట్ భాస్కర్.
ఇక డిప్రెషన్ లోకి వెళ్లిపోయినప్పుడే తలకు కూడా దెబ్బ తగిలి.. కుట్లు కూడా వేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ తన లైఫ్ లో జరిగిన సంఘటన చెప్పుకొచ్చాడు. కొన్నాళ్లు పిచ్చివాడిలా తిరిగాక ఆ తర్వాత తనను తాను మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట.. ఎవరైనా ఒక అమ్మాయి మోసం చేస్తే చంపాలి .. కొట్టాలి అని అనిపించడం సహజం.. కానీ నేను మాత్రం ఆ మోసం చేసిన అమ్మాయిని నా ఎదుగుదలతో కొట్టాలని అనుకున్నాను. అలా ఆమె మీద ఉన్న కసితోనే నా టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలని హైదరాబాద్ వచ్చి జబర్దస్త్ కామెడీ షో లో అవకాశం దక్కించుకొని ప్రస్తుతం ఈ స్టేజ్ లో ఉన్నాను అంటూ బుల్లెట్ భాస్కర్ వెల్లడించారు.