ఏపీలో రాజకియాలు రోజు రోజుకు వేడేక్కుతున్నాయి. ఎవరికీ వాళ్ళు ఎన్నికల్లో గెలుపు కోసం ప్రచారాలు చేస్తున్నారు..2024 లో వచ్చే ఎన్నికల్లో ఏపీకి సీఎం ఎవరూ అవుతారు.జనాలు ఎవ్వరికి పట్టం కడతారు.అనే ప్రశ్న జనాల్లో వినిపిస్తోంది..వైసీపికి గట్టి పోటీని ఇచ్చే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతూ నేతలకు సూచనలు ఇస్తున్నారు.అధికార పార్టీకి అడుగడుగున సవాల్ విసురుతూ పార్టీకి నిలుపుకోవడానికి విస్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీని ఈసారి ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని బాగా కష్టపడుతున్నాడు.అందుకే రాష్ట్రంలో జనవాణి కార్యక్రమం పేరుతో సభలు ఏర్పాటు చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వం పై చురకలు వేస్తున్నారు..పవన్ ముక్కుసూటి మనిషి ప్రజల కష్టాలను తీర్చడానికి ఎంతవరకైన వెలతారు.అంటూ యువత పవన్ కల్యాణ్ వైపు నిలుస్తున్నారు..యువత పూర్తి మద్దతు జనసేనకు ఇస్తున్నారు అనడం లో ఎటువంటి సందేహం లేదు..అదీగాక నిన్న విశాఖ ఘటన కూడా పవన్ కు ప్లస్ అయ్యింది.
ఇక వైసీపి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈసారి ఎన్నికల్లో కూడా తమకె అధికారం రావాలని ప్రజలకు మరింత దగ్గరయ్యె ప్రయత్నం చేస్తున్నారు.. జగన్ పాద యాత్ర లో చేసిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవెరుస్తున్నారు..దీంతో ప్రజల్లో రోజు రోజుకు వైసీపి పై నమ్మకం పెరుగుతుంది..అంతేకాదు గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో వైఎస్సార్‌సీపీకి ప్రజలు ఘన విజయాన్ని అందిస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్‌కు, ఆ పార్టీకి ప్రతి ఎన్నికలోనూ ఓట్ల శాతం పెరుగుతూనే వస్తోందని.. తాజాగా సీఓటర్–ఇండియా టుడే సర్వే ఏకంగా 57 శాతం మంది సీఎంగా వైఎస్ జగనే కావాలంటూ బలంగా కోరుకున్నట్లు స్పష్టం చేసింది..మళ్ళీ వైసిపి అధికారంలోకి వస్తే టీడీపీ,జనసేన పార్టీలకు మనుగడ పోవడం ఖాయమని రాజకీయ విష్లెషకులు అంటున్నారు..చుద్దాము..ప్రజలు ఎవరికీ పట్టం కడతారో..