హోటల్స్‌లో చెఫ్స్‌ ఎందుకు వైట్‌ కాప్‌ పెట్టుకుంటారు.. టోపీ ఎత్తును బట్టి అది చెప్పేయొచ్చట.!

-

హోటల్స్‌లో వంట చేసే వాళ్లు.. తెల్లని టోపీలను ధరిస్తుంటారు. మీకు ఎప్పుడైనా ఈ డౌట్‌ వచ్చిందా..? వంట చేసేప్పుడు తెలియకుండానే చాలా మరకలు పడతాయి కదా.. మరీ ఎందుకు వైట్‌ యూనిఫామ్‌, వైట్‌ టోపీలనే చఫ్‌లు పెట్టుకుంటారు అని.. దీని వెనుక కారణం ఏంటో ఇప్పుడు చూద్దామా.!
అన్ని హోటల్స్‌లో ఉండే కామన్ విషయం ఏంటంటే.. ఈ చెఫ్ లు తెల్లని పొడవైన టోపీలను ధరించడం. టోపీలు ధరించినప్పటికీ.. దాని ఎత్తులో కూడా ఒక వ్యత్యాసం ఉంది.. టోపీ ఎత్తు వంటగదిలోని చెఫ్ యొక్క పొజిషన్ ను సూచిస్తుంది. ఎక్కువ పొజిషన్ కలిగి ఉన్న చెఫ్ పొడవైన టోపీలను ధరిస్తూ ఉంటారు.
ఈ సంప్రదాయం 1800ల ప్రారంభంలో ఫ్రాన్స్‌లో పురాణ చెఫ్ మేరీ-ఆంటోయిన్ కారేమ్ తన చెఫ్‌లకు యూనిఫాం ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రారంభమైందట.. అతను తెలుపు రంగును ఇష్టపడే రంగుగా ఎంచుకున్నాడు, ఎందుకంటే ఇది శుభ్రతను సూచిస్తుంది, అతని వంటగది సిబ్బంది అందరూ వేర్వేరు ర్యాంక్‌లను సూచించే వివిధ ఎత్తులతో కూడిన టోపీ ధరించాలని రూల్ పెట్టారట.

ఇంకో కారణం కూడా..

అసలు ఇలా టోపీలు ధరించడానికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే.. వంట చేసేటప్పుడు పొరపాటున వెంట్రుకలు ఆహరంలో పడితే.. తినే సమయంలో ఇబ్బంది ఎదురవుతుంది. కష్టమర్స్‌ గోల చేస్తారు.. అందుకే కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదు అన్న కారణంతో వంట చేసేవారు తమ హెయిర్‌ని టోపీతో కప్పుకుంటారు. అప్పుడు వెంట్రుకలు ఆహారంలో కలిసే అవకాశం ఉండదుగా..!
చాలామంది.. వైట్‌ అంటే.. వెంటనే మురికి అవుతుంది అని ప్రిఫర్‌ చేయరు. కానీ వైట్‌ కలర్‌ ఇచ్చే లుక్క్‌ మరే రంగు ఇవ్వలేదు. వైట్‌ డ్రస్‌కానీ, ఇంట్లో వైట్‌ ఇంటీరియర్‌ డిజైన్‌ కానీ సూపర్‌ లుక్‌ వస్తుంది. తెలుపు శాంతికి చిహ్నంగా చెప్తారని మనకు ఎలాగూ తెలుసు. చఫ్‌లు వైట్‌ యూవిఫామ్‌లో ఉండటం వల్ల.. మనకు ఆటోమెటిక్‌గా వారిని చూస్తే మైండ్‌ కూల్‌ అవుతుంది. అలా కాకుండా.. ఎరుపు లేదా బ్లూ లేదా గ్రీన్‌ కలర్‌లో ఉంటే..మైండ్‌ గందరగోళంగా అవుతుంది.!

Read more RELATED
Recommended to you

Latest news