నాడు ఎన్టీఆర్.. నేడు కేసీఆర్.. సాధ్యమేనా?

-

పూర్తిగా దక్షిణ భారతదేశంకు అన్యాయం జరుగుతున్న రోజులు అవి..ఇంకా చెప్పాలంటే తెలుగు ప్రజలకు. కేంద్రంలో తెలుగు వాళ్ళకు సరైన గౌరవం దక్కేది కాదు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకునే పరిస్తితి ఉండేది కాదు. అలాంటి పరిస్తితుల్లో తెలుగువాడి ఆత్మగౌరవం కోసమని చెప్పి ఎన్టీఆర్..తెలుగుదేశం పార్టీ పెట్టి..కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్‌కు చుక్కలు చూపించారు. అలాగే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఏపీలోకి అధికారంలోకి వచ్చి..ఆ తర్వాత కేంద్రంలో చక్రం తిప్పారు. కాంగ్రెస్ వ్యతిరేక కూటమి కట్టి సత్తా చాటారు.

అయితే అప్పటినుంచి తెలుగు వాళ్ళకు హస్తినలో గౌరవం దక్కేది..కేంద్ర రాజకీయాల్లో వారి పాత్ర పెరిగింది. ఇలా తెలుగువాడి సత్తా ఏంటో ఎన్టీఆర్..ఆనాటి నార్త్ ప్రజలకు తెలిసేలా చేశారు. ఇక ఇప్పుడు అదే బాటలో కేసీఆర్ కూడా వెళ్లబోతున్నారని టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ..దక్షిణ భారతదేశానికి న్యాయం చేయడం లేదని, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలని పట్టించుకోవడం లేదని, ఇక్కడ నుంచి పన్నుల రూపంలో డబ్బులు గుజుతున్నారు గాని..కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు సాయం అందడం లేదనే వాదన ఎప్పటినుంచో నడుస్తోంది.

కానీ రెండు రాష్ట్రాల్లో ఉన్న నాయకులు..తమ పరిస్తితులని బట్టి బీజేపీకి ఎదురుతిరుగులేని పరిస్తితి. అయితే మొన్నటివరకు తెలంగాణ సీఎం కేసీఆర్..అదే తరహాలో ముందుకెళ్లారు. కానీ ఎప్పుడైతే తెలంగాణలో బీజేపీ బలం పెరగడం మొదలైందో అప్పటినుంచి కేసీఆర్..రూట్ మార్చేశారు. నెక్స్ట్ కేసీఆర్‌ని గద్దె దించేసి అధికారంలోకి రావాలని బీజేపీ గట్టిగా ట్రై చేస్తుంది. ఇక బీజేపీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ రంగంలోకి దిగారు. మళ్ళీ తెలంగాణలో అధికారం దక్కించుకోవడంతో పాటు..కేంద్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలని కేసీఆర్ చూస్తున్నారు.

ఈ క్రమాంలోనే దేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీలని ఏకం చేసి..ఒక కూటమి కట్టి..మోదీ-అమిత్ షా ద్వయానికి చెక్ పెట్టాలని కేసీఆర్ చూస్తున్నారు. ఇక ఏకంగా జాతీయ పార్టీ పెట్టి..జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే జాతీయ పార్టీకీ సంబంధించిన విధివిధానాలని ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. ఈ దసరాకు జాతీయ పార్టీ ప్రకటన చేయబోతున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు…కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతారని బ్యానర్లు కడుతున్నారు. తెలుగోడి ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం నాడు ఎన్టీఆర్..నేడు కేసీఆర్ పనిచేస్తున్నారని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ మాదిరిగా కేసీఆర్ ఎంతవరకు సక్సెస్ అవుతారనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version