పవన్-రఘురామలను పక్కన పెట్టేశారా? పక్కకు నెట్టేశారా?  

-

ఏపీలో మోదీ పర్యటనపై ఎలాంటి రాజకీయం జరగలేదు గాని…మోదీ సభ విషయంలో మాత్రం పెద్ద రాజకీయమే నడిచింది. ప్రధాని మోదీ…భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్రానికి సంబంధించిన అధికార, ప్రతిపక్ష నేతలు హాజరు కావాల్సి ఉంది. ఇక అందుకు తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం…అధికార, విపక్ష నేతలని మోదీ కార్యక్రమానికి ఆహ్వానించారు.

సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబులని ఆహ్వానించారు. అలాగే కేంద్ర మాజీ మంత్రిగా ఉన్న చిరంజీవిని సైతం ఆహ్వానించారు. అయితే అధికారం వైసీపీ చేతుల్లో ఉండటంతో…చంద్రబాబు కార్యక్రమానికి హాజరు కాకుండా తమ పార్టీ ప్రతినిధిగా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని పంపించారు. దీంతో ప్రోటోకాల్ ప్రకారం అచ్చెన్న కూడా మోదీ సభకు హాజరు కావాలి. కేంద్రం కూడా అచ్చెన్న పేరుని లిస్ట్ లో పెట్టింది. కానీ కింది స్థాయికి వచ్చేసరికి వైసీపీ ప్రభుత్వం..అచ్చెన్న పేరుని లిస్ట్ నుంచి తొలగించిందని తెలిసింది. దీంతో అచ్చెన్న సభకు హాజరు కాలేకపోయారు. దీని ద్వారా టీడీపీని, మోదీకి దగ్గర కానివ్వలేదు. సరే టీడీపీ సంగతి వదిలేస్తే…వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అంశం బాగా హైలైట్ అయింది. నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామ…తన పార్లమెంట్ పరిధిలో జరిగే కార్యక్రమానికి రావాలి..పైగా అల్లూరి విగ్రహావిష్కరణ..అది కూడా తన సొంత ప్లేస్ భీమవరంలో…కానీ వైసీపీ ప్రభుత్వం…రఘురామని రానివ్వకుండా ఎలా నిలువరించిందో అందరికీ తెలిసిందే.

ఎప్పటినుంచో రఘురామ, వైసీపీ ప్రభుత్వం మధ్య వార్ నడుస్తోంది…ఢిల్లీలో ఉంటూ…రఘురామ…వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. దీంతో రఘురామని దెబ్బకొట్టాలని వైసీపీ ఎదురుచూస్తుంది. ఇదే క్రమంలో ఆయన్ని మోదీ సభకు రానివ్వకుండా అడ్డుకున్నారు. సభకు రావాలని బయలుదేరిన రఘురామ..మధ్యలో వెనుదిరిగారు. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీగా రఘురామ పేరు ఉండాలి…కానీ వైసీపీ ప్రభుత్వం రఘురామని ఆహ్వానితుల జాబితా నుంచి తొలగించినట్లు తెలిసింది..దీంతో పేరు లేకపోవడం, పైగా రఘురామ అనుచరులని పోలీసులు అరెస్ట్ చేయడంతో..ఆయన ఏపీలో అడుగుపెట్టలేకపోయారు.

ఇక రఘురామ పరిస్తితి అలా ఉంటే…బీజేపీ మిత్రుడుగా ఉన్న పవన్ పరిస్తితి మరోలా ఉంది..అసలు ఆయనకు ఆహ్వానం అందిందో లేదో కూడా క్లారిటీ లేకుండా పోయింది. అయితే రాజకీయాల్లో లేకపోయిన చిరంజీవిని సభకు ఆహ్వానించారు…కానీ పవన్ ని ఆహ్వానించినట్లు కనబడలేదు. దీంతో పవన్ కూడా సభకు రాలేదు…ఆఖరికి జనసేన ప్రతినిధులు సైతం కనబడలేదు. అంటే టీడీపీతో పాటు పవన్, రఘురామ లను సభకు రానివ్వకుండా ఆపడంలో వైసీపీ సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి వీరిని బీజేపీ పక్కన పెట్టకపోయినా.. జగన్ మాత్రం అందరీని పక్కకు నెట్టి బీజేపీకి దగ్గరయ్యే విషయంలో సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news