హైదరాబాద్ లో మరోసారి మద్యం షాపులు బంద్

-

హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి నగర వ్యాప్తంగా వైన్ షాపులు బంద్ కానున్నాయి. రేపు శ్రీరామ నవమి కావడంతో సిటీ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ లో ఎక్కడైనా మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 

నగరంలో రేపు భారీ ఎత్తున శ్రీరామనవమి శోభాయాత్ర జరుగనుంది. దీనికి హైకోర్ట్ కూడా పర్మిషన్ ఇచ్చింది. భారీ కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ శోభాయాత్ర జరగనుంది. సీతారాంబాగ్ లో మొదలైన రాముడి శోభాయాత్ర బోయిగూడ కమాన్, మంగళ్ హాట్ పీఎస్, ధూల్ పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, సిద్ధి అంబర్ బజార్, చుడీ బజార్, బేగం బజార్, గౌలి గూడ చమన్, పుత్లీ బౌలి చౌరస్తా మీదుగా సుల్తాన్ బజార్ చేరనుంది.

అయితే సున్నిత పరిస్థితులు ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత తీసుకుంటున్నారు.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత పెంచనున్నారు. దీంట్లో భాగంగానే మద్యం షాపులను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news