భర్త శవంతో ఇంట్లోనే రెండు రోజులు.. లోపలికి వెళ్లిన పోలీసులు షాక్‌..

-

తమిళనాడు ఓ షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త మృతి చెందినా.. రెండో రోజుల పాటు భర్త మృతదేహంలో ఓ మహిళ ఇంట్లోనే ఉన్న ఘటన చైన్నైలోని పురాసవల్కం ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అశోక్ బాబు(53) అనే వ్యక్తి తన భార్య పద్మినీ(48)తో కలిసి వైకోకరన్ స్ట్రీట్​లో నివసిస్తున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కుమారుడు విదేశాల్లో పనిచేస్తున్నాడు. కుమార్తెకు వివాహమై.. బెంగళూరులో నివసిస్తోంది. పద్మినీ మానసిక సమస్యలతో బాధపడుతోంది. అయితే ఈ నేపథ్యంలో.. రెండు రోజుల నుంచి కూతురు ఆర్తి తన తండ్రికి ఫోన్ చేస్తున్నప్పటికీ.. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.

దీంతో ఆర్తి తమిళనాడులోని స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలు కొట్టుకొని ఇంట్లోకి వెళ్లారు. అశోక్ బాబు చనిపోయి ఉండటాన్ని గమనించారు. శరీరంపై దుస్తులు లేకుండా నేలపై పడి ఉన్నాడని పోలీసులు తెలిపారు. శవం పక్కనే పద్మినీ కూర్చొని ఉందని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. పద్మినీని మానసిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version