మహిళలూ వేసవిలో ఇవి మస్ట్.. లేదంటే ఇన్ఫెక్షన్లు తప్పవు..!

-

వేసవికాలంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వేసవికాలంలో చర్మ సమస్యలు కూడా ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి వేసవికాలంలో చెమట విపరీతంగా పడుతుంది దాంతో రకరకాల సమస్యలు వస్తాయి. వేసవికాలంలో మహిళలు ముఖ్యంగా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి లేకపోతే వాజీనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వంటివి సంభవించే అవకాశం ఉంటుంది వేసవిలో ఆరోగ్యం పట్ల సరదాగా తీసుకోకండి. వేసవిలో మహిళలు హైజిన్ ని పాటించకపోతే రకరకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి వేసవి కాలంలో మహిళలు కచ్చితంగా పాటించాల్సిన విషయాలను ఇప్పుడు చూద్దాం.

తడి బట్టలని వెంటనే మార్చుకోండి:

స్విమ్మింగ్ చేసిన తర్వాత లేదంటే స్నానం చేసిన తర్వాత వెంటనే తడి ఆరిపోయేలా తుడుచుకోవాలి తడి బట్టలతో కూర్చోవడం వలన ఈస్ట్ ఇన్ఫెక్షన్ సంభవించే అవకాశం ఉంది మంట దురద వంటివి కలిగితే ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టే.

కాటన్ లో దుస్తులను వేసుకోండి:

అందమైన సిల్కీ ఇన్నర్స్ ని కాకుండా కాటన్ దుస్తులని ఎంపిక చేసుకోండి. సమస్యలు ఉండవు. ఎండాకాలంలో కాటన్ లో దోస్తులని మాత్రమే ధరించండి లేకపోతే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వంటివి చోటు చేసుకోవచ్చు.

పాడ్స్ టామ్ఫాన్స్ ని తరచూ మార్చుకుంటూ ఉండండి:

పాడ్స్ వంటి వాటిని అలా వదిలేస్తే ఇన్ఫెక్షన్స్ చోటు చేసుకునే అవకాశం ఉంది వేసవికాలంలో ఈ విషయంలో తప్పక జాగ్రత్త వహించండి. పాడ్స్ టామ్ఫాన్స్ ని మార్చుకోవడానికి ఫోన్లో రిమైండర్ ని సెట్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ కనుక మీరు అలా ఉండిపోయారు అంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వంటివి కచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది.

సువాసనని ఇచ్చే ప్రొడక్ట్స్ ని వాడకండి:

పర్ఫ్యూమ్స్ కెమికల్స్ తో కూడిన వాటిని వేసవిలో ఉపయోగించడం వలన ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది వేసవికాలంలో చర్మ ఆరోగ్యం పై తప్పక శ్రద్ధ పెట్టాలి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా జాగ్రత్త వహించండి. చాలా మంది చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇన్ఫెక్షన్స్ బారిన పడాల్సి వస్తోంది కాబట్టి ఈ వేసవిలో ఈ విషయాలపై జాగ్రత్త వహించి సమస్యలేమి లేకుండా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version