మహిళా దినోత్సవం రోజు ఓ మహిళ సీఐకి అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ నగర పోలీస్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మహిళా సీఐ మధులత ఎస్ హెచ్ ఓగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో హైదరాబాద్ నగరంలో ఓ మహిళా పోలీసు అధికారి ఎస్ హెచ్ ఓగా చేసింది లేదు. తాజాగా తెలంగాణ పోలీస్ శాఖ మధులతకు కీలక బాధ్యతలు అప్పగించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా సీఐ మధులతకి ఎస్ హెచ్ ఓ గా బాధ్యతలు అప్పగించారు హోంమంత్రి మహమూద్ అలీ, నగర సీపీ సీవీ ఆనంద్. లాలాగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వోగా బాధ్యతలు స్వీకరించారు మధులత. 2002 బ్యాచ్ కు చెందిన మధులత సౌత్ జోన్ పాతబస్తీ ఉమెన్ పోలీస్ స్టేషన్ సీఐగా, ఎస్ బీ వింగ్ సీఐగా గతంలో విధులు నిర్వహించారు మధులత.