దొర తీరుతో రాష్ట్రంలో రైతుల బలవన్మరణాలు పెరుగుతున్నాయి : షర్మిల

-

వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. రైతుల‌కు ల‌క్ష రూపాయ‌ల రుణ మాఫీ చేస్తాన‌ని హామీ ఇచ్చాడ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు దాని గురించి ఊసెత్త‌డం లేద‌ని ఆరోపించారు. మాయ మాట‌లు చెప్ప‌డం, ఓట్లు వేయించ‌డం ఆ త‌ర్వాత మ‌రిచి పోవ‌డం, చెప్పిన దానిని అన‌లేద‌ని బుకాయించ‌డం కేసీఆర్ కు మొద‌టి నుంచి అల‌వాటేన‌ని ఎద్దేవా చేసింది.

దొర తీరుతో రాష్ట్రంలో రైతుల బలవన్మరణాలు పెరుగుతున్నాయని, తొమ్మిదేండ్లలో దాదాపు 9వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ లో 2018 నుంచి ఇప్పటి వరకు రూ.26వేల కోట్లు వ్యవసాయానికి కేటాయించారని, దొర ఖర్చు చేసింది కేవలం రూ.1200 కోట్లు మాత్రమేనని తెలిపారు. మహానేత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడాదిలోనే రుణమాఫీ చేసి చూపించారన్న షర్మిల.. దొర మాత్రం నాలుగేండ్లు దాటినా ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. మాట ఇస్తే తలనరుక్కుంటానని చెప్పిన కేసీఆర్ సారూ ఎక్కడాక అని ప్రశ్నించారు. రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, తక్షణమే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version