మధ్య దూరం
ఒక అధినాయకత్వానికీ ఒక ఎంపీకీ
మధ్య దూరం
దూరం మరియు భారం పెరిగి పెరిగి
విస్తృత రీతిలో ఆయనలో ఉన్న అసంతృప్తి
వెల్లడిలోకి వస్తోంది..ఆ కారణంగా ఆయన
జగన్ కు ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నారు
లేదా పార్టీ మారి తన సత్తా అయినా చాటాలని
భావిస్తున్నారు. మిగిలిన ఎంపీ లకు భిన్నంగా ఉండే
ఆయనకు రైతు పక్షపాతి అని పేరు. విద్యా వేత్తగా గుర్తింపు
ఉన్నాయి.. అవే రేపటి వేళ ఆయనకు అదనపు బలాలు కూడా !
ముఖ్యంగా జిల్లాల ఏర్పాటు విషయమై కూడా ఆయన అసంతృప్తితోనే ఉన్నారని తెలుస్తోంది. నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను అనౌన్స్ చేసినప్పటికీ సంబంధిత ప్రతిపాదనలు ఏవీ బాగాలేవని ఎంపీ అంటున్నారు. దీంతో పాటు పార్టీ అధిష్టానంకు ఏం చెప్పినా కూడా వినిపించుకోవడం లేదు అని కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు.
గతంలో వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తగాదాతో పార్టీ పరువు చాలానే పోయింది. ఓ రైతును చెప్పు కొట్టేందుకు వెళ్లారన్న అభియోగం తరువాత అదే రైతును అరెస్టు చేయించడం ఇవన్నీ కూడా ఆయనకు నచ్చలేదు అని కూడా తేలిపోయింది. దీంతో ఆయన పార్టీ కి గుడ్ బై చెబితే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచిస్తున్నారు. అదేవిధంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ కి ఆయనకూ మధ్య విభేదాలు ఉన్నాయని కూడా సమాచారం. ఇవన్నీ ఓ ఎత్తయితే అధికారంలో ఉండి కూడా తన ఆఫీసు ముందరి రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నా కూడా భరించాల్సి వస్తుందని, కొత్త రోడ్డు వేయించుకునేందుకు కూడా వీలుగా లేదని, ఏమంటే అధికారులు నిధులు లేవనే అంటున్నారని ఆయన ఆవేదన చెందుతున్నారు. ఒక్కటి కాదు రెండు చాలా పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారు అన్న వార్తలు గుప్పు మంటున్నాయి. నిప్పు లేనిదే పొగరాదు.. ఒప్పుకోవాలి.,. ఎవరు ఈ జ్వాలను రగిలించారు.. ఎవరు దీనికి బలి కానున్నారు అన్నది ఇప్పుడొక హాట్ టాపిక్ .